Ukraine Russia Conflict: గ్రనేడ్లతో రష్యా సైనికుడి బెదిరింపులు

4 Mar, 2022 09:02 IST|Sakshi

Ukraine Conflict: ఉక్రెయిన్‌లోని దక్షిణ తీర నగరం కొనొటొప్‌ను గురువారం రష్యా సేనలు దిగ్బంధించాయి. నగరంలోకి ప్రవేశించిన పౌరులను లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. రష్యా సైనికుడొకరు నగరంలోని ఓ ప్రాంతంలో చేతుల్లో రెండు గ్రనేడ్లను పట్టుకుని, ప్రజల మధ్య తిరుగుతున్న వీడియో ఫుటేజీ ఒకటి బయటకు వచ్చింది. భయంతో కొందరు గ్రనేడ్‌ విసిరేయాలని అతడిని కోరగా, షేమ్‌ షేమ్‌ అని మరికొందరు అరుస్తున్నట్లుగా అందులో ఉంది.

లొంగిపోతారా లేక పోరాడతారా అని నగర మేయర్‌ ఆర్టెమ్‌ను ఆ సైనికుడు హెచ్చరించాడు. ఈ విషయమై మేయర్‌ ఆర్టెమ్‌ స్పందిస్తూ.. ప్రస్తుతం బలగాలు నగరం బయటకు వెళ్లిపోయాయని చెప్పారు. తాము పోరాడటానికే నిశ్చయించుకున్నట్లు నగర ప్రజలు తెలిపారని అన్నారు. గురువారం ఉదయం నల్లసముద్ర తీర నగరం ఖెర్సన్‌పై పట్టుసాధించినట్లు రష్యా బలగాలు మొదటిసారిగా వెల్లడించాయి.  

(చదవండి: రష్యాకు కోలుకోలేని దెబ్బ.. ఇలా జరిగిందేంటి.. పుతిన్‌ తప్పు చేశారా..?)

మరిన్ని వార్తలు