Russia War: ఛీ.. వీళ్లేం సైనికులు.. పురుషులను కూడా వదలరా..!

5 May, 2022 06:59 IST|Sakshi

ఉక్రెయిన్‌పై దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. అమెరికా, యూరప్‌ దేశాల ఆయుధ సరఫరాలే లక్ష్యంగా పశ్చిమ ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది. లివీవ్‌పైనా తీవ్రస్థాయిలో దాడులకు దిగింది. 

ఉక్రెయిన్‌లోకి ఆయుధాలతో వెళ్లే నాటో, పాశ్చాత్య వాహనాలన్నింటినీ ధ్వంసం చేసేస్తామని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ హెచ్చరించారు. తూర్పున డోన్బాస్‌ను పూర్తిగా చేజిక్కించుకునే ప్రయత్నాలను కూడా రష్యా ముమ్మరం చేసింది. అక్కడి క్రొమటోర్క్‌స్, సెవరోడోనెట్స్‌క్‌ సహా పలు నగరాలను ఆక్రమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఇంగ్లండ్‌ వెల్లడించింది. తాజా దాడుల్లో వందలాది మంది పౌరులు మరణించినట్టు ఉక్రెయిన్‌ చెప్పింది. 

ఇదిలా ఉండగా.. రష్యా సైనికులు ఉక్రెయిన్‌లో చెప్పుకోలేని దారుణాలకు ఒడిగడుతున్నారు. పురుషులతో పాటు బాలురపై కూడా వారు అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఐక్యరాజ్యసమితి యుద్ధ నేరాల సంస్థ పేర్కొంది. పలువురు బాలురపై వారి ఇంటి పెద్దల కళ్లముందే ఈ దారుణానికి పాల్పడ్డట్టు తమ దృష్టికి వచ్చిందని లైంగిక హింసపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటెన్‌ చెప్పారు. ‘‘అత్యాచారం ద్వారా బాధితులనే గాక వారి కుటుంబాన్ని, సమాజాన్ని చెప్పలేనంతగా కుంగదీయొచ్చు. యుద్ధాల్లో ఇదో ఖర్చు లేని మారణాయుధంగా, సైకలాజికల్‌ వార్‌ఫేర్‌గా మారిపోయింది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఆమె ప్రస్తుతం కీవ్‌లో పర్యటిస్తూ లైంగిక హింస ఆరోపణలపై ఆధారాలు సేకరిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: వర్క్‌పర్మిట్లపై యూఎస్‌ కీలక నిర్ణయం

>
మరిన్ని వార్తలు