Ukrainian Melitopol Mayor: రష్యా బలగాల అరాచకం.. ఉక్రెయిన్‌ మేయర్‌ని కిడ్నాప్‌ చేసి..

12 Mar, 2022 08:39 IST|Sakshi

Ukrainian officials said Melitopol Mayor Kidnapped: ఉక్రెయిన్‌ రష్యా మధ్య సాగుతున్న పోరు నేటికి 17వ రోజుకి చేరుకుంది. రష్యా బలగాల దాడిలో ఉక్రెయిన్‌ అల్లకల్లోలంగా మారిపోయింది. ఇప్పుడప్పుడే కోలుకోలేనంత దారుణంగా దెబ్బతింది. ఒకపక్క వైమానిక క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్న రష్యా ఉక్రెయిన్‌లోని నగరాలను స్వాధీనం చేసుకుంటూ పోతుంది.

ఇందులో భాగంగానే రష్యా బలగాలు దక్షిణ ఉక్రెయిన్‌లోని మెట్రోపోల్‌ నగరాన్ని స్వాధీనం చేసుకోవడమే కాక ఆ నగర మేయర్‌ని కూడా కిడ్నాప్‌ చేసినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ వెల్లడించారు. అంతేకాదు సుమారు 10 మంది ఆక్రమణదారుల బృందం మెట్రోపోల్‌ మేయర్‌ ఇవాన్‌ ఫెడోరోవ్‌ను కిడ్నాప్‌ చేసిందని ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ ట్విట్టర్‌లో పేర్కొంది.

అయితే, అతను రష్యా బలగాలకు సహకరించడానికి నిరాకరించినందుకే కిడ్నాప్‌ చేసినట్లు జెలెన్‌ స్కీ ఒక వీడియో సందేశంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. అంతేకాదు ఆ వీడియోలో మేయర్‌ను తన సభ్యుల కోసం ప్రాణాలను ఫణంగా పట్టి పోరాడిన గొప్ప ధైర్యశాలిగా పేర్కొన్నారు. నిజానికి ఇది ఆక్రమణదారుల బలహీనతకు సంకేతం, వారు చట్టబద్దమైన స్థానిక ఉక్రెయిన్‌ అధికారుల ప్రతినిధులను బలవంతంగా  తొలగించి ఉగ్రవాద చర్యలకు బీజం వేస్తున్నారు అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఆక్రోశించారు.

ఇతి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన చర్యగా పేర్కొన్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌ టెర్రరిస్టుల మాదిరిగినే రష్యన్‌ బలగాల దురాక్రమణ చర్యలు ఉన్నాయన్నారు. అంతేకాదు రష్యా దురాక్రమణదారులు మెట్రోపోల్‌ నగర ఆక్రమణకు ముందు ఈ నగరంలో సుమారు లక్షమంది నివాసితులు ఉన్నారు.

(చదవండి: రష్యా ఘాతుకం ప్రపంచానికి తెలియాలి.. పుతిన్‌ పక్కా ప్లాన్‌తో ఉన్నాడు’)

మరిన్ని వార్తలు