ఎందుకింత ఉగ్రరూపం?.. జెలెన్‌స్కీ ట్వీట్‌

19 Oct, 2022 09:02 IST|Sakshi

కీవ్‌: లక్షలాది మంది ఉక్రేనియన్లను అంధకారంలోకి నెడుతూ విద్యుత్, నీటి వనరులే లక్ష్యంగా వైమానిక దాడులను రష్యా మంగళవారం మరింత ఉధృతం చేసింది. కీవ్‌తోపాటు పశ్చిమంగా ఉన్న ఝిటోమిర్‌ నగరంపైనా దాడులు పెరిగాయి.

‘యుద్ధంలో సైనిక ఓటమిని తట్టుకోలేక రష్యా కొత్తగా ఉగ్రతాండవం చేస్తోంది. ఎందుకింత ఉగ్రరూపం? మాపై ఒత్తిడి పెంచాలనా ? యూరప్‌ మీదనా? లేక మొత్తం ప్రపంచం మీదనా?’ అని జెలెన్‌స్కీ ట్వీట్‌లో మండిపడ్డారు. 

సైనిక స్థావరాలు, పరిశ్రమలు, రెండున్నర లక్షల జనాభాతో నిండిన ఝిటోమిర్‌పై దాడుల నేపథ్యంలో నగరమంతా విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. ఇంధనాగారం ధ్వంసమైంది. కీవ్‌పై దాడిలో ఇద్దరు మరణించారు. డినిప్రో సిటీపైనా క్షిపణి దాడులు ఎక్కువయ్యాయి. ఇప్పటికే రష్యా అధీనంలోకి వెళ్లిన జపోరిజియా ప్రాంతంపైనా రష్యా డ్రోన్‌ దాడులు ఆగకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు