ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి: ‘నేను చనిపోయాక విమానం పంపినా లాభంలేదు’

4 Mar, 2022 19:16 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం ఆ దేశంలో విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటీవల దాడిలో ఓ విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. గత వారం మరో విద్యార్థి హర్జోత్‌ సింగ్‌ కాల్పుల్లో గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని  కోలుకున్నాక హర్జోత్‌ మాట్లాడుతూ.. అంబులెన్స్‌లో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు అతను గాయాలతో గంటల తరబడి రోడ్డుపైనే ఉన్నట్లు తెలిపాడు.

తనపై దాడి జరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికి కూడా భారత రాయబార కార్యాలయం నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి సహాయం అందడంలేదని అవేదన వ్యక్తం చేశాడు. అంతేకాక తాను భారత ఎంబసీతో టచ్‌లో ఉన్నానని.. అయినా ప్రతిరోజు వాళ్లు ఏదో ఒకటి చేస్తామని మాటలు చెబుతున్నారు తప్ప చేతులు ఏంలేదని వాపోయాడు హర్జోత్ సింగ్. అదృష్టవశాత్తు దేవుడు తనకు రెండవ జీవితాన్ని ఇచ్చాడని, తాను చనిపోయిన తర్వాత విమానం పంపితే ఏం లాభం లేదని హర్జత్‌ తన అవేదనను వ్యక్తం చేశాడు.

తనని ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు రప్పించాలని, వీల్ చైర్ వంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు డాక్యుమెంటేషన్‌లో తనకు సహాయం చేయాలని రాయబార కార్యాలయాన్ని అభ్యర్థిస్తున్నట్లు” సింగ్ తన భావోద్వేగ విజ్ఞప్తిలో పేర్కొన్నాడు. ప్రతిరోజూ బాంబులు, కాల్పులు, క్షిపణుల శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పారు. కాగా ఈ ఘటన ఫిబ్రవరి 27న జరిగింది. ఉక్రెయిన్‌లోని పరిస్థితుల దృష్ట్యా హర్జోత్‌ తిరిగి భారత్‌కు రావాలని నిర్ణయించుకుని ఒక క్యాబ్‌ని మాట్లాడుకొని ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో అతని కాల్పులు జరిగాయి.
 

మరిన్ని వార్తలు