సొంతంగా స్పేస్‌ స్టేషన్‌ని నిర్మించనున్న రష్యా... యూఎస్‌తో మరో ఆరేళ్లు...

28 Jul, 2022 12:51 IST|Sakshi

వాషింగ్టన్‌: రష్యా అంతరిక్ష కేంద్రం చీఫ్‌ బోరిసోవ్ సంచలన ప్రకటన చేశారు. 2024 నాటికల్లా రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఐతే ఇరు దేశాల మాజీ ప్రచ్ఛన యుద్ధ వ్యతిరేకులు రెండు వారాల కిందటే క్రూ ఎక్స్‌ఛేంజ్‌ ఒప్పందంపై సంతకాలు చేసిన తరుణంలో ఆయన ఈ అనుహ్య ప్రకటన వెల్లడించారు. ఇది భవిష్యత్తులో యూఎస్‌ వ్యోమోగాములు, రష్యన్‌ వ్యోమోగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విమానాలు పంచుకునేలా వీలు కల్పించే ఒప్పందం.

అదీగాక నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌నెల్సన్‌ రష్యా ఐఎస్‌ఎస్‌ భాగస్వామ్యాన్ని 2030 వరకు పొడిగించేలా నాసా,  రోస్కోస్మోస్ చర్చలు జరుపుతున్నాయని అన్నారు. పైగా ఈ చర్చలు సఫలం అయ్యేవరకు కూడా రష్యా కొనసాగేలా నాసా ప్రణాళికను అమెరికా శ్వేతసౌధం అమోదించిందని చెప్పారు. అంతేకాదు రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో తమ సొంత అంతరిక్ష ఔట్‌పోస్ట్‌ను నిర్మించి, పనిచేసేంత వరకు తమతో కలిసి పనిచేయాలని నాసా అధికారులు కోరినట్లు తెలిపారు. పైగా రష్యా కూడా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నట్లు స్పష్టం చేసింది కూడా. దీంతో అమెరికాతో రష్యా తన భాగస్వామ్యాన్ని మరో ఆరేళ్లు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. 1998లో ప్రారంభించబడిన ఐఎస్‌ఎస్‌ యూఎస్‌-రష్యన్‌ నేతృత్వంలోని భాగస్వామ్యం నవంబర్‌ 2020 నుంచి నిరంతరంగా కొనసాగింది. దీనిలో కెనడా, జపాన్‌తో సహా సుమారు 11 యూరోపియన్‌ దేశాల భాగస్వామ్యాం కూడా ఉంది.

ఐతే రష్యా తమ భాగస్వామ్యంలో భాద్యతలన్నింటిని నెరవేర్చి 2024 తర్వాత నుంచి వైదోగాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు బోరిసోవ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో అన్నారు. కానీ ఐఎస్‌ఎస్‌ డైరెక్టర్ రాబిన్ గాటెన్స్ ఈ విషయం గురించి రష్యన్ సహచరులు తనకు తెలియజేయలేదని ఆమె అన్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు వైట్ హౌస్ ప్రతినిధి కరీన్ జీన్-పీటర్స్ కూడా మాస్కో ఐఎస్ఎస్ నుంచి వైదొలగాలనే ఉద్దేశాన్ని అమెరికాకు అధికారికంగా తెలియజేయలేదని చెప్పారు.

రష్యా ఉక్రెయిన్‌ పై యుద్ధానికి దిగడంతోనే యూఎస్‌, రష్యా దేశాల మధ్య సంబంధాలు కొంత మేర దెబ్బతిన్నాయి. అదీగాక యుద్ధాన్ని విరమించుకోమని యూఎస్‌ పదేపదే హెచ్చరించడమే కాకండా ఆంక్షలు విధించేందుకు కూడా యత్నించింది. దీంతో ఇరు దేశాల మధ్య కాస్త విభేదాలు తలెత్తాయి. ఐతే అమెరికాలోని నాసా అధికారులు మాత్రం ఇరు దేశాల మధ్య అంతరిక్ష కేంద్రంలో ద్వైపాక్షిక సహకారం అలాగే ఉంటుందని చెప్పడం గమనార్హం. అంతేకాదు అమెరికా కాలిఫోర్నియా విశ్యవిద్యాలయం ప్రస్తుత వ్యోమోగామీ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గారెట్ రీస్మాన్, రిటైర్డ్‌ వ్యోమగామీ తాము కలిసే ఉన్నామని, తమ భాగస్వామ్య సహకారం అలాగే కొనసాగుతుందని చెప్పడం విశేషం.

(చదవండి: యుద్ధానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా... యూఎస్‌కి స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

మరిన్ని వార్తలు