Salman Rushdie: నిలకడగా ఆరోగ్యం.. వెంటిలేటర్‌ తొలగింపు

14 Aug, 2022 17:42 IST|Sakshi

న్యూయార్క్‌: భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్‌ బహుమతి విజేత సల్మాన్‌ రష్దీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.  రష్దీకి వాయవ్య పెన్సిల్వేనియాలోని యూపీఎంసీ హ్యమాట్‌ సర్జరీ సెంటర్‌ ఆస్పత్రిలో ఇప్పటివరకూ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. తాజాగా సల్మాన్‌ రష్దీ ఆరోగ్యం కాస్త అదుపులోకి రావడంతో వెంటిలేటర్‌ తొలగించారు. ప్రస్తుతం రష్దీ మాట్లాడుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. 

ఆయనకు వెంటిలేటర్‌ను వైద్యులు తొలగించారని వివరించారు. అమెరికాలోని ఓ వేదిక పై ప్రసంగించడానికి వెళ్లిన సల్మాన్ రష్దీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. సల్మాన్ రష్దీ మెడపై, పొట్టలోనూ పలుమార్లు కత్తితో పొడిచారు. 20 సెకండ్ల వ్యవధిలోనే సుమారు 10 నుంచి 15 సార్లు కత్తి పోట్లకు సల్మాన్ రష్దీ గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బలగాలు నిందితుడిని అరెస్టు చేశాయి. సల్మాన్ రష్దీని వెంటనే చాపర్‌లో హాస్పిటల్‌కు తరలించారు. అత్యవసర చికిత్సలో భాగంగా వైద్యులు నిరంతరం శ్రమించడంతో రష్దీ ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రావడమే కాకుండా బెడ్‌పైనే ఆయన జోక్‌లు వేస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు.

చదవండి: సల్మాన్‌ రష్డీపై దాడి.. 30 ఏళ్లు భయం గుప్పిట్లోనే! ఆ నవల జోలికి వెళ్లినోళ్లందరికీ ఇదే గతి!

మరిన్ని వార్తలు