తర్వాతి వైరస్‌..మరింత ప్రమాదకారి కావొచ్చు! 

7 Dec, 2021 07:54 IST|Sakshi

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కరోనా టీకా రూపకర్త హెచ్చరిక 

లండన్‌: భవిష్యత్తులో మానవాళికి సోకే వైరస్‌ ప్రస్తుత కరోనా కంటే మరింత ప్రాణాంతకం, మరింత తీవ్రమైన వ్యాపించవచ్చని కోవిషీల్డ్‌ టీకా రూపకర్త, ప్రొఫెసర్‌ సారా గిల్బర్ట్‌ హెచ్చరించారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్‌గా సారా గిల్బర్డ్‌ పనిచేస్తున్నారు. ‘మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా వైరస్‌ చిట్టచివరిది కాదు. మున్ముందు ఇంతకంటే ప్రమాదకరమైంది రావచ్చు.

చదవండి: కేన్సర్‌ను చంపే రోబోలు!

ఆ వైరస్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందేది, ప్రమాదకరమైంది అయి ఉండొచ్చు. అయితే, ఇప్పటి మాదిరి పరిస్థితులనే మున్ముందు దాపురించే అవకాశం రానీయవద్దు. ప్రస్తుతం సాధించిన విజయాలను ఆసరాగా చేసుకుని ఇలాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు మరింతగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది’అని ఆమె తెలిపారు. పూర్తి సమాచారం తెలిసే వరకు కొత్త వేరియంట్ల వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

మరిన్ని వార్తలు