సౌదీలో రక్షణ రంగంలోకి తొలిసారిగా మహిళలు

23 Feb, 2021 03:15 IST|Sakshi

రియాద్‌: మహిళాభ్యున్నతిలో సౌదీ అరేబి యా రాచరిక వ్యవస్థ మరో అడుగు ముం దుకు వేసింది. శతాబ్దాలుగా పురుషులకు మాత్రమే పరిమితమైన సౌదీ రక్షణ రంగంలోకి తొలిసారిగా మహిళలు అడుగుపెట్టి, దేశ రక్షణ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇకపై సౌదీనారీమణులు రక్షణ రంగంలో స్త్రీపురుష వివక్షకి చెరమగీతం పాడుతూ నావికా దళం మొదలుకొని, గగనతల రక్షణ వ్యవస్థ వరకు అన్నింటా అడుగుపెట్టబోతున్నారు. సౌదీ రాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ విజన్‌ 2030లో భాగంగా సౌదీ మహిళలకు విభిన్న విభాగాల్లో ప్రవేశం కల్పిస్తూ మహిళా సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగానే తాజాగా సౌదీ రక్షణ శాఖ పకటన చేసింది.సౌదీ అరేబియన్‌ ఆర్మీ, రాయల్‌ సౌదీ వైమానిక దళం, రాయల్‌ సౌదీ నావికాదళం, రాయల్‌ సౌదీ వ్యూహాత్మక మిస్సైల్‌ ఫోర్స్, ఇతర సాయుధ బలగాలు, సైనిక వైద్య సేవారంగంలోకి మహిళలు ప్రవేశించవచ్చని సౌదీ రక్షణ శాఖ ప్రకటించింది.

మరిన్ని వార్తలు