ఇక పెళ్లిళ్లు కష్టమే! పాకిస్తాన్‌కు షాకిచ్చిన సౌదీ

20 Mar, 2021 11:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆ 4 దేశాల స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు: సౌదీ

రియాద్‌: సౌదీ అరేబియా తన దేశంలోని పురుషులకు షాకిచ్చింది. పాకిస్తాన్‌తో సహా మరో మూడు దేశాల మహిళలను వివాహం చేసుకోకూడదంటూ ఆదేశాలు జారీ చేసిందట. ఈ విషయాన్ని పాకిస్తాన్‌కు చెందిన డాన్‌ వెల్లడించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్కి చెందిన మహిళల్ని పెళ్లి చేసుకోవద్దని... సౌదీ పాలకులు ఆదేశాలు జారీ చేసినట్లు సౌదీ మీడియా చెబుతోందని డాన్ రిపోర్ట్ చేసింది. అంతేకాదు సౌదీ అరేబియా జారీ చేసిన తాజా ఉత్తర్వలు ఆ దేశంలో కలకలం రేపుతున్నాయని డాన్‌ పేర్కొంది. అనధికారిక లెక్కల ప్రకారం... ఈ నాలుగు దేశాలకు చెందిన 5 లక్షల మంది మహిళలు ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నారు. 

ఇన్నాళ్లు సౌదీ అరేబియా ప్రజలు ఈ నాలుగు దేశాల ప్రజలను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ తాజా ఆదేశాలతో ఈ దేశాల మహిళల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే... కఠిన నిబంధనలు అడ్డొస్తాయి అని మక్కా డైలీ రిపోర్ట్ చేసింది. అసలు నిషేధం విధించడం.. కఠినమైన ఆంక్షలు పెట్టడం ఎందుకు అంటే గత కొన్నాళ్లుగా సౌదీ అరేబియాలో విదేశీ మహిళల్ని పెళ్లి చేసుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని పాలకులు భావించినట్లు తెలిసింది. ఎవరైనా తప్పనిసరిగా విదేశీ మహిళను పెళ్లి చేసుకోవాలంటే... కొన్ని అదనపు రూల్స్ పాటించాల్సి ఉంటుంది.

ఇప్పుడు విదేశీ మహిళను పెళ్లి చేసుకోవాలి అనుకునే సౌదీ అరేబియా పురుషులు... వివాహానికి ముందు తప్పనిసరిగా ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకోవాలి. ప్రభుత్వం దాన్ని ప్రభుత్వం ఆమోదించాలో లేదో నిర్ణయిస్తుంది. ఎవరైనా విడాకులు తీసుకొని... మళ్లీ పెళ్లికి రెడీ అయితే... వారు 6 నెలల దాకా పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని డైరెక్టర్ మేజర్ జనరల్ అస్సాఫ్ అల్ ఖురేషీ తెలిపారు. అప్లికేషన్ పెట్టుకునేవారి వయస్సు 25 ఏళ్లు దాటి ఉండాలి. అప్లికేషన్‌పై ముందుగానే స్థానిక జిల్లా మేయర్ సంతకం పెట్టి ఉండాలి. గుర్తింపు పత్రాలు (ఐడీ కార్డులు), ఫ్యామిలీ కార్డు కాపీ వంటివి సమర్పించాల్సి ఉంటుంది.

ఇక అప్లికేషన్‌ చేసుకునే వ్యక్తికి అప్పటికే వివాహం అయితే అతడు తన భార్యకు సంబంధించి వికలాంగురాలని లేదా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుందని.. లేదా ఆమె మానసిక ఆరోగ్యం సరిగా లేదని డాక్టర్‌ సర్టిఫికెట్‌ తప్పని సరిగా సమర్పించాలని తాజా ఆదేశాలు పేర్కొంటున్నాయి. 

చదవండి: సీఎం సాబ్‌... నాకు పెళ్లి కూతుర్ని చూడండి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు