సౌదీ సైన్యం కాల్పుల్లో వందలాది మంది మృతి !

22 Aug, 2023 06:19 IST|Sakshi

దుబాయ్‌: సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించేందుకు యతి్నంచిన ఇథియోపియా వలసదారులపై సౌదీ బలగాలు జరిపిన కాల్పుల్లో వందలాదిమంది మృతి చెందినట్లు హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ మంగళవారం తెలిపింది. సైన్యం మెషిన్స్‌ గన్లు, మోర్టార్లతో జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది.

యెమెన్‌ వైపు ఉన్న సరిహద్దు నుంచి వస్తున్న వలసదారులపైకి సౌదీ బలగాలు కాల్పులు జరపడంపై ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోందని సౌదీ అధికారి ఒకరు ఖండించారు. సౌదీలో ప్రస్తుతముంటున్న 7.50 లక్షల మంది ఇథియోపియన్‌ శరణార్థుల్లో 4.50 లక్షల మంది అనధికారికంగా ఉంటున్నవారే. ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్న సౌదీ ప్రభుత్వం వీరిని వెనక్కి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు