కారుతో బారీకేడ్లు ధ్వంసం చేసి మక్కాలోకి

31 Oct, 2020 21:20 IST|Sakshi

రియాద్‌ : ఇస్లాం పవిత్ర స్థలమైన మక్కా మసీదులోకి ఓ వ్యక్తి కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. మసీదు వద్ద భద్రతగా ఉన్న గార్డులు అతడ్ని వెంబడించి పట్టుకున్నారు. సదరు వ్యక్తి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తున్నది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా అధికారులు శనివారం ధ్రువీకరించారు. శుక్రవారం మధ్యాహ్నం మసీదు దక్షిణ ద్వారాలలో ఒకదానిని ఢీకొట్టి లోనికి కారుతోపాటు వెళ్లేందుకు ఓ వ్యక్తి విఫలయత్నం చేశాడు. బయట ఉన్న రెండు బారికేడ్లను అధిగమించగా.. అక్కడే ఉన్న గార్డ్లులు అతడిని వెంబడించి నిలువరించినట్లు సమాచారం. కారుతో మక్కాలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరును సౌదీ అధికారులు వెల్లడించలేదు. అయితే అతనికి మతిస్థిమితం సరిగా లేదని మాత్రం తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయానికి పంపించామని వారు చెప్పారు. (చదవండి : పిచ్చి ప్రయోగాలకు పోతే జరిగేది ఇదే)

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మూతపడిన పవిత్ర మక్కా మసీదు.. ఏడు నెలల అనంతరం ఈ నెలలో తెరుచుకున్న విషయంత తెలిసిందే.  కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉమ్రా తీర్థయాత్ర మార్చిలో నిలిపివేశారు. గత ఏడాది దాదాపు 2.5 లక్షల మంది యాత్రికులు మక్కాను దర్శించుకోగా.. ఈసారి కేవలం 10 వేల మంది దేశ పౌరులు మాత్రమే పాల్గొనేందుకు అనుమతించారు. (చదవండి : ఆన్‌లైన్‌​ గేమ్‌ ఆడుతుండగా భూకంపం..)

మరిన్ని వార్తలు