పాపం ట్రంప్‌.. ఆ దేశ రాజు నకిలీ బహుమతులు ఇచ్చాడట!

13 Oct, 2021 18:18 IST|Sakshi

సాధారణంగా దేశాధినేతలు తమ దేశంలో పర్యటిస్తే వారికి అతిథి మర్యాదలతో పాటు బహుమతులు కూడా ఇస్తుంటారు. ఈ తరహాలోనే అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సౌదీ పర్యటన చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశ రాజు ఇచ్చిన బహుమతులు తీసుకున్నారు. అయితే తాజాగా అందులో కొన్ని నకిలీవని తేలింది. బహుమతుల జాబితాలో.. పులి, చిరుత చర్మంతో చేసిన దుస్తులు, మూడు కత్తులు, మూడు బాకులు, ఇతర ఖరీదైనవి ఉన్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే.. 2017లో డొనాల్డ్‌ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి హోదాలో సౌదీ అరేబియా సందర్శించారు. ఆ సందర్భంగా సౌదీ రాజ కుటుంబం ట్రంప్‌తోపాటు ఆయన సహాయకులకు పలు విలువైన బహుమతులను అందించింది. అయితే వారు ఆ బహుమతులను తీసుకున్నారు గానీ వాటి గురించి అప్పటి వైట్‌ హౌస్‌ సంబంధిత అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇక ప్రత్యేంగా పులి, చిరుత నమూనాలను అనుకరించేలా ఉన్న దుస్తులకు రంగు వేసినట్లు తాజాగా తేలింది.

ఇదే నిజమైనవే అయితే, 1973 నాటి పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ట్రంప్‌ ప్రభుత్వం అంతరించిపోతున్న జాతుల చట్టాన్ని ఉల్లంఘించిందని ఇప్పటికే ఆరోపణలు మొదలయ్యాయి. ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ కాలం ముగించే చివరి రోజు వైట్ హౌస్ ఈ బహుమతులతో పాటు వాటి వివరాలను సాధారణ పరిపాలన శాఖకు తెలియజేసింది.

చదవండి: Byzantine Wine Complex:వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్‌​ కాంప్లెక్స్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు