భూమికి మంచు యుగాన్ని ఇచ్చింది మనమే! 

10 Jun, 2021 08:42 IST|Sakshi

భారతదేశం ఆసియా ఖండంలో భాగమేనా? ఇప్పుడెందుకీ డౌట్‌.. నిజమేగా అంటారా.. ఇది ఇప్పుడు నిజం.. ఇంతకు ముందు అబద్ధం. మళ్లీ ఇదేం కొర్రీ అని సందేహాం వస్తోందా? నిజమే.. ఇండియా వేరే ఖండం నుంచి వచ్చి ఆసియాకు కలిసింది. ఇదేకాదు ఇంకా ఎన్నోవిశేషాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందామా? 

అంతా టెక్టానిక్‌ ప్లేట్ల మహిమ! 

భూమి మొత్తం మూడు పొరలుగా ఉంటుంది. భూమి మధ్యలో ఉన్నది కోర్, దానిపై మాంటిల్, ఆపై క్రస్ట్‌ పొరలు ఉంటాయి. కోర్‌ అంతా దాదాపు ఇనుము, ఇతర లోహాల ముద్ద అయితే.. మధ్యలోని మాంటిల్‌ చాలా రకాల మూలకాలతో కూడిన లావా. అన్నింటికన్నా పైన ఉన్న క్రస్ట్‌ గట్టిగా మట్టి, రాళ్లతో ఉంటుంది. అయితే ఈ క్రస్ట్‌ ఏకమొత్తంగా పొరలా ఉండకుండా.. పెద్ద ముక్కలు (ప్లేట్లు)గా ఉంటుంది. వీటినే టెక్టానిక్‌ ప్లేట్లు అంటాం. వీటితోనే వివిధ ఖండాలు (కాంటినెంట్స్‌) ఏర్పడుతాయి. మాంటిల్‌పై తేలుతున్నట్టుగా ఉండే ఈ టెక్టానిక్‌ ప్లేట్లు.. భూభ్రమణం, పరిభ్రమణం, ఇతర అంశాల కారణంగా కదులుతూ ఉంటాయి. 

గోండ్వానా ఖండం ముక్కలై.. 
మొదట్లో భూమిపై ఖండాలన్నీ వేరుగా ఉండేవి. యూరప్, ఆసియా కలిసి యూరేíÙయన్‌ ఖండంగా.. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆ్రస్టేలియాతోపాటు భారత ఉప ఖండం (ఇండియా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు) మొత్తం కలిపి గోండ్వానా ల్యాండ్‌ అనే మరో పెద్ద ఖండంగా ఉండేవి. సుమారు 18 కోట్ల ఏళ్ల కింద టెక్టానిక్‌ ప్లేట్ల కదలికలతో.. గోండ్వానా ముక్కలైంది. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆ్రస్టేలియా దూరంగా కదిలిపోయాయి. భారత ఉప ఖండం యూరేనియన్‌ టెక్టానిక్‌ ప్లేట్‌ వైపు వచి్చంది. టెక్టానిక్‌ ప్లేట్ల కదలికలు అంటే మనం ఏమాత్రం గుర్తు పట్టలేనంత మెల్లగా జరుగుతాయి. అంటే సంవత్సరానికి పది, పదిహేను సెంటీమీటర్ల దూరం కదులుతాయి. 

హిమాలయాలను పుట్టించి.. 

యూరేనియన్‌ ప్లేట్‌ వైపు ఇండియన్‌ ప్లేట్‌ జరగడంతో.. ఆ ఒత్తిడికి భారీ స్థాయిలో భూభాగం పైకి లేచి, ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతాలైన హిమాలయాలు ఏర్పడ్డాయి. ఎత్తైన ప్రాంతాలు మంచుతో నిండి గంగ, సింధు, బ్రహ్మపుత్ర ఇలా ఎన్నో నదులకు జన్మనిచ్చాయి. ఇలాంటి నదుల నుంచి కొట్టుకువచి్చన మట్టితో ఏకంగా బెంగాల్‌ డెల్టా ఏర్పడింది. 

మంచు యుగాన్ని తెచ్చి.. 
యూరేనియన్, ఇండియన్‌ టెక్టానిక్‌ ప్లేట్లు ఢీకొట్టడానికి ముందు భూమి చాలా వేడిగా ఉండేది. ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో మంచు ఉండేది కాదు. మొత్తంగా నీళ్లు, నీటి ఆవిరే ఉండేది. ఈ టెక్టానిక్‌ ప్లేట్లు ఢీకొట్టాక పైకి లేచిన భూభాగంలోని సిలికేట్లు భూవాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ను వేగంగా పీల్చుకున్నాయి. ఇది ‘గ్లోబల్‌ కూలింగ్‌ (సూర్య కిరణాలు భూమి నుంచి ఎక్కువగా పరావర్తనం చెంది చల్లబడటం)’కు దారి తీసింది. అది భూమిపై మంచు యుగానికి దారితీసింది. అదే సమయంలో హిమాలయాలు, ధ్రువాలు, ఇతర ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి. 


అప్పటి జీవులనూ మోసుకొచ్చి.. 
అప్పటి ఖండాల్లో జీవజాలం వేర్వేరుగా ఉండే ది. గోండ్వానా ల్యాండ్‌ నుంచి విడిపోయి వచి్చ న ఇండియా.. ఆ జీవులనూ మోసుకొచ్చి ఆసియా, యూరప్‌ ఖండాలకు అందించింది. లక్షల ఏళ్లనాటి శిలాజాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. ఆఫ్రికా, ఇండియా, దక్షిణ అమెరికా ఖండాల్లో జీవులన్నీ ఒకటేనని నిర్ధారించారు. 

జింక లాంటి జీవి నుంచి తిమింగలాలు  
గోండ్వానా నుంచి విడిపోయిన ఇండియా ప్రాంతం ఎన్నో జీవ సంబంధ మార్పులకు దారితీసింది. కొత్త జీవులు అభివృద్ధి చెందడానికి కారణమైంది. అన్నింటికన్నా చిత్రమైన విషయం ఏమిటంటే.. భారత ఉప ఖండంలో ఒకప్పుడు నివసించిన జింక తరహా ‘ఇండోహ్యూస్‌’ అనే జీవులు మార్పు చెంది ప్రస్తుతమున్న తిమింగలాలుగా పరిణామం చెందినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. 

ఇండియా ఇంకా కదులుతూనే ఉంది 
భారత ఉప ఖండం ప్రాంతం ఇప్పటికీ యూరేíÙయన్‌ ప్లేట్‌ వైపు కదులుతూనే ఉంది. దీని కారణంగానే రెండింటి మధ్య ఘర్షణ ఏర్పడి ఆ ప్రాంతంలో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయి. 2001లో గుజరాత్‌లోని భుజ్‌లో వచ్చిన భారీ భూకంపం అందులో భాగమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  
చదవండి: ‘గురు’ ఉపగ్రహం ఇలా ఉన్నాడు

500 కిమీ నడవాలి.. అందుకే సేద తీరుతున్నాం

మరిన్ని వార్తలు