140 ఏళ్ల తర్వాత కన్పించిన 'నెమలి పావురం'.. ఫొటో వైరల్..

20 Nov, 2022 17:40 IST|Sakshi

అత్యంత అరుదైన బ్లాక్ నేప్డ్ పీసాంట్ పీజియన్ పక్షి(నెమలిలా కన్పించే పావురం) 140 ఏళ్ల తర్వాత కన్పించింది. శాస్త్రవేత్తలు దీన్ని తిరిగి కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. ద్వీపకల్ప దేశం పపువా న్యూగినియాలో స్థానికులను వివరాలు అడిగి నెలరోజుల పాటు అడవిలో తిరిగి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు వారి శ్రమకు ఫలితం దక్కింది.

శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిన కెమెరాల్లో ఈ పక్షి దృశ్యాలు రికార్డయ్యాయి. బ్లాక్ నెప్డ్‌ పీసాంట్ పీజియన్‌ను ఇప్పటికే అంతరించిపోయిన జాతిగా ప్రకటించారు. ఇది పపువా న్యూ గినియా అడవిలో మాత్రమే ఇంకా అత్యంత అరుదుగా కన్పిస్తోంది.

10 ఏళ్లుగా కన్పించని, ఇంకా అంతరించిపోని పక్షులను కనుగొనే కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నంలో ఈ నెమలి పావురం కన్పించింది. ఇది గొప్ప విజయంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. ఇలా కన్పించని అరుదైన పక్షులు మొత్తం 150 ఉన్నట్లు చెప్పారు. ఈ పక్షిని చూశామని స్థానికులు చెప్పడంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
చదవండి: ఆరు నెలల తర్వాత చైనాలో తొలి కరోనా మరణం

మరిన్ని వార్తలు