గులాబీ కలర్‌ వేసినందుకు ఏకంగా రూ. 19 లక్షలు జరిమానా

31 Oct, 2022 18:31 IST|Sakshi

ఇంటి ముందర తలుపులకు ఎలాంటి కలర్‌లు ఉండాలో కొన్ని దేశాల్లో షరతులు ఉంటాయి. ఆయా దేశాల్లో ఏ కలర్‌ పడితే అది వేస్తే అక్కడ అధికారులు అంగీకరించారు. ఐతే ఒక మహిళ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటి ముందర తలుపులకు తనకు నచ్చిన రంగు వేసింది. దీంతో సదరు కౌన్సిల్‌  అధికారులు ఈ విషయమై అభ్యంతర వ్యక్తం చేస్తూ సుమారు 19 లక్షలు జరిమానా విధించారు. ఈ వింత ఘటన స్కాట్లాండ్‌లో చోటు చేసుకుంటుంది.

వివరాల్లోకెళ్తే...స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో ఉన్న మిరాండా డిక్సన్‌ అనే మహిళ తన ఇంటి ముందర తలుపులకు పింక్‌(గులాబీ) కలర్‌ వేసింది. దీంతో ఆ సిటీ కౌన్సిల్ ప్లానర్లు ఈ కలర్‌పై అభ్యంతరరం వ్యక్తం చేస్తూ... తెలుపు రంగు వేయాలని ఆదేశించారు. కానీ ఆ మహిళ మాత్రం తన ఇంటికి ఆ రంగు ఎంతో అం‍దాన్ని ఇచ్చిందని, చూడముచ్చటగా ఉందని చెబుతోంది. ఆమెకు ఈ ఇల్లు 2019లో తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా లభించింది. ఈ ఇంటిని రెండేళ్లపాటు మరమత్తులు చేయించింది. ఐతే చివర్లో ఫినిషింగ్‌ టచ్‌గా ఇంటి ముందు ఉండే తలుపులకు మాత్రం గూలాబి రంగు వేసింది.

యూకేలోని బ్రిస్టల్‌, నాటింగ్‌హిల్‌, హారోగేట్‌ వంటి నగరాల్లో ఇంటి ముందు తలుపులు ముదురు రంగులో ఉంటే నా ఇంటి ముఖ ద్వారం మాత్రం ఇలా భిన్నంగా గులాబీ రంగులో ఉండటం తనకు ఆనందంగా ఉంటుందని చెబుతోంది. అదీగాక చాలామంది తన ఇంటి ముందు ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతుంటారని, చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుందని అంటోంది.

అంతేగాదు పలువురు తనకు మద్దతు తెలిపారని, ఈ రంగు చాలా బావుటుందంటూ సిటీ కౌన్సలర్‌లకు నచ్చచెప్పే ప్రయత్నం కూడా చేసింది. కానీ కౌన్సలర్‌ ప్లానర్లు మాత్రం ససేమిరా అంటూ తెలుపు రంగు వేయాలని ఆదేశించారు. అంతేగాదు ఒకవేళ తలుపులకు రంగు మార్చనట్లయితే సుమారు రూ. 19 లక్షల వరుకు జరిమాన ఎదుర్కోవాల్సి ఉంటుందని తెగేసి చెప్పారు.  

(చదవండి: లాక్‌డౌన్‌ అంటే హడలిపోతున్న చైనా...కంచెలు, గోడలు దూకి పారిపోతున్న జనం)

మరిన్ని వార్తలు