ఆస్ట్రేలియాలో అధికారం చేపట్టిన లేబర్‌ పార్టీ

24 May, 2022 08:22 IST|Sakshi

కొత్త ప్రధానిగా ఆంటోనీ అల్బనీస్‌

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్‌ పరిపాలనకు తెరపడింది. ఇప్పటివరకు 50శాతం ఓట్లను లెక్కించగా ప్రతిపక్ష లేబర్‌ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు ఆస్ట్రేలియా మీడియా ఇదివరకే వెల్లడించింది. లేబర్‌ పార్టీ అధ్యక్షుడు ఆంటోనీ అల్బనీస్‌ తదుపరి ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుత ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ తన ఓటమిని అంగీకరించారు. 

గత మూడేళ్లలో కరోనా విజృంభణ, వాతావరణ మార్పులు కారణంగా ఏర్పడిన విపత్తుల్ని ఎదుర్కోవడంలో అధికార పార్టీ వైఫల్యం ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది.  మూడేళ్లకి ఒకసారి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ సంకీర్ణ కూటమి కంటే లేబర్‌ పార్టీ హామీలు ఇవ్వడంలోనూ, ప్రజల విశ్వాసం చూరగొనడంలోనూ విజయం సాధించింది.

మరిన్ని వార్తలు