సముద్ర గర్భంలో స్కూబా డైవర్‌కు హగ్‌ ఇచ్చిన ఆక్టోపస్‌! వీడియో వైరల్‌

16 Jul, 2022 14:08 IST|Sakshi

ఎన్నో అద్భుతాలు, అందమైన జీవులకు నిలయం సముద్ర గర్భం. అక్కడ కన్పించే జలచరాలను చూస్తే ముచ్చటేస్తుంది. ఒక్కసారైనా వాటి దగ్గరకు వెళ్తే బాగుండనిపిస్తుంది. సాధారణ మనుషులకు ఇది కష్టమే అయినా స్కూబా డైవర్లు చాలా ఈజీ. వారు చాలా సార్లు సముద్రం అడుగుకు వెళ్తుంటారు. 

ఇప్పుడు అలాంటి స్కూబా డైవర్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. సముద్ర గర్భంలో అతడు ఆక్టోపస్‌తో సరదాగా ఆడుకున్నాడు. అది కూడా అతనితో చనువుగా మెదిలింది. స్కూబ్ డైవర్ అరచేతి చూపగానే ఆక్టోపస్‌ అటువైపే దూసుకెళ్లింది. ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత.. ఆక్టోపస్ అతని చేతిపైకి వెళ్లి సేదతీరింది.

ఈ వీడియోను ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీనికి దాదాపు 30లక్షల వ్యూస్ వచ్చాయి. దీన్ని చూసిన కొంతమంది నెటిజన్లు సరదా కామెంట్లు పెట్టారు. స్కూబా డైవర్‍కు ఆక్టోపస్ హగ్ ఇచ్చిందని, అతను చాలా లక్కీ అని చమత్కరించారు.

చదవండి: 11ఏళ్ల తర్వాత హాలిడే.. ఎగ్జైట్‌మెంట్‌లో తాగి విమానంలో రచ్చ రచ్చ..

మరిన్ని వార్తలు