క్వీన్‌ ఎలిజబెత్‌ హ్యాండ్‌బ్యాగ్‌ వెనక ఇంత రహస్యముందా?

28 Sep, 2022 08:55 IST|Sakshi

హ్యాండ్‌బ్యాగ్‌... మహిళల జీవితంలో ఓ భాగం. ఇటీవల మరణించిన బ్రిటన్‌ మహారాణి క్వీన్‌ ఎలిజబెత్‌–2 సైతం నిత్యం హ్యాండ్‌బ్యాగ్‌ను క్యారీ చేసేవారు. 1950 నుంచి 2022వరకు ఆమె ఫొటోలను గమనిస్తే.. అన్నింట్లో ఆమె బ్లాక్‌ లానర్‌ హ్యాండ్‌బ్యాగ్‌ను ధరించే కనిపిస్తారు. బ్లాక్‌ బ్యాగ్‌ మాత్రమే ఎందుకు వాడేవారు? ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌గానా? అంటే కానేకాదు. అంతకుమించి. బ్యాగ్‌ ద్వారా తన సిబ్బందికి రహస్య సమాచారాన్ని చేరవేసేవారామె. బ్యాగ్‌ ప్రతి కదలిక, పొజిషన్‌ను బట్టి డిఫరెంట్‌ మెసేజ్‌ను పంపించేవారు. ఎలా అంటే... 

►ఆమె ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎడ­మ చేతి­పై బ్యాగ్‌ను కుడిచేతికి మార్చారంటే.. ఆ సంభాషణను ముగించాలి అనుకుంటున్నారని అర్థం. 
► చేతిలోని బ్యాగ్‌ను కింద పెట్టారంటే... తాను అసౌకర్యంగా ఫీలవు­తున్నానని, వెంటనే ఆ వ్యక్తిని బయటికి పంపించేయాలని సూచన.  
► భోజనం చేసేటప్పుడు ఆ బ్యాగ్‌ను టేబుల్‌ మీద పెట్టారంటే.. ఐదు నిమిషాల్లో భోజ­నం ముగించేయాలి అనుకున్నారన్నట్టు.  

►అలాంటి కీలకమైన పాత్రపోషించే బ్యాగ్‌ ఉంటేనే ఆమె కంఫర్టబుల్‌గా ఫీలయ్యేవారు.
►ఆ చివరకు సెప్టెంబర్‌ 6న ప్రధానిగా లిజ్‌ట్రస్‌ బాధ్యతలు తీసుకునేరోజు సైతం బాల్మోరల్‌ క్యాజిల్‌లో జరిగిన కార్యక్రమంలో సైతం క్వీన్‌ బ్లాక్‌ హ్యాండ్‌బ్యాగ్‌ ధరించి ఉన్నారు. 
►ఆఇంతకూ ఆ బ్యాగ్‌లో ఏముండేవో తెలుసా? సాధారణ మహిళల బ్యాగుల్లో ఉన్నట్టే... చిన్న అద్దం, లిప్‌స్టిక్, కొన్ని మింట్‌ బిల్లలు, ఒక జత రీడింగ్‌ గ్లాసెస్‌.   

మరిన్ని వార్తలు