ఆమె ‘సెక్స్‌ జీవితం’ వెల్లడించాల్సిందే!

20 Oct, 2020 14:29 IST|Sakshi
ఘిస్లేన్‌ మాక్స్‌వెల్‌

న్యూయార్క్‌ సిటీ అప్పీళ్ల కోర్టు ఆదేశం

న్యూయార్క్‌ : ఏ సమాజంలోనైనా స్త్రీ, పురుషుల మధ్య సెక్స్‌ సంబంధాలు ఇతరుల జీవితాలకు హాని కలిగించనంత కాలం వారి వారి సొంతం. శిక్షార్హమైన నేరాలతో సంబంధం లేనంత వరకు కోర్టులు కూడా సెక్స్‌ సంబంధాలను వ్యక్తిగత వ్యవహారాలుగానే పరిగణించి వాటిలో సాధారణంగా జోక్యం చేసుకోవు. న్యూయార్క్‌ సిటీలో ప్రముఖ సోసలైట్‌గా ఓ వెలుగు వెలిగిన ఘిస్లేన్‌ మాక్స్‌వెల్‌ రహస్య సెక్స్‌ జీవితాన్ని యావత్తు బట్టబయలు చేయాల్సిందేనని, కోర్టు విచారణలో 418 పేజీల్లో వెల్లడించిన అన్ని అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిందేనని అప్పీళ్ల కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు న్యూయార్క్‌ సిటీలోని సెకండ్‌ సర్యూట్‌కు చెందిన అప్పీళ్ల కోర్టు సోమవారం నాడు అరుదైన ఆదేశాలను జారీ చేసింది.

ఎపిస్టీన్‌తో ఘిస్లేన్‌
సెక్స్‌ అనుభవాలు వ్యక్తిగతమైనవని, వాటిని గోప్యంగా ఉంచాలని, వాటిని సంబంధించి కోర్టు విచారణలో తాను వెల్లడించిన అంశాలను బయటకు విడుదల చేసినట్లయితే మీడియా వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందంటూ 58 ఏళ్ల మాక్స్‌వెల్‌ చేసిన వాదనను ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచీ నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. 30 ఏళ్ల నుంచి సెక్స్‌ మానియాక్‌ (మద పిచ్చోడు) జెఫ్రే ఎపిస్టీన్‌తో శంగార జీవితం గడుపుతూనే మైనర్‌ బాలికలను కూడా ప్రలోభ పెట్టి వారిని ఎపిస్టీన్‌కు తార్చడం ద్వారా వారి జీవితాలను దెబ్బతీశావని, అలాంటి నేరాలతో సంబంధం తమ సెక్స్‌ జీవితం వ్యక్తిగతం, గోప్యత పరిధిలోకి రావని ధర్మాసనం తేల్చి చెప్పింది. సెక్స్‌ మానియాక్‌ ఎపిస్టీన్‌తో 30 ఏళ్ల క్రితమే శృంగార జీవితాన్ని పెనవేసుకున్న మాక్స్‌వెల్‌ 1994 నుంచి 1997 వరకు 14 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపున్న పలువురు ఆడపిల్లలను ఎపిస్టీన్‌కు తార్చారు.

టీచర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన జెఫ్రీ ఎపిస్టీన్, ఫైనాన్సియర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే బోలడంత డబ్బు సంపాదించారు. ఓ పక్క సమాజంలో సంపన్నుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు స్నేహ సంబంధాలను కొనసాగిస్తూ మరోపక్క విలాసవంతమైన ఫామ్‌ హౌజ్‌లో మైనర్‌ బాలికలను నిర్బంధించి లైంగిక వాంఛలను తీర్చుకునే వాడట. అలా 36 మంది బాలికలు, యువతులను సెక్స్‌ పావులుగా వాడుకోగా 2005 ఒక కేసులో, 2012లో మరో కేసులో, రెండు కేసుల్లో మాత్రమే జెఫ్రీ ఎపిస్టీన్‌ జైలు శిక్షలు అనుభవించారు.

ప్రిన్స్‌ ఆండ్రీ, మాక్స్‌వెల్‌తో ఫిర్యాది వర్జీనియా రాబర్ట్‌

ఆ తర్వాత వర్జీనియా రాబర్ట్‌ సహా పలువురు యువతులు మీడియా ముందుకు వచ్చి తమను ఎపిస్టీన్‌ లైంగికంగా ఎలా వాడుకున్నారో, ఆయనకు మాక్స్‌వెల్‌ ఎలా సహకరించారో వెల్లడించడంతో 2019 జూలైలో న్యూయార్క్‌ పోలీసులు ఎపిస్టీన్‌ను, మాక్స్‌వెల్‌ను అరెస్ట్‌ చేసి వేర్వేరు జైళ్లలో నిర్బంధించారు. నెల రోజుల్లోనే అంటే 2019, ఆగస్టు 10వ తేదీన ఎపిస్టీన్‌ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. తన పడక గది నిండా తన నగ్న చిత్రాలతో అలంకరించుకొని ఎపిస్టీన్‌తో రహస్య సెక్స్‌ జీవితాన్ని పంచుకున్న మాక్స్‌వెల్‌పై ఇంకా విచారణ కొనసాగుతోంది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు