ఒకదాని వెంట మరొకటి.. చైనాలో వరుస భూకంపాలు

22 May, 2021 11:55 IST|Sakshi

బీజింగ్‌: వరుసగా చోటు చేసుకుంటున్న భూకంపాలు చైనాను కుదిపేస్తున్నాయి. కొద్దిపాటి విరామంతోనే మళ్లీమళ్లీ భూమి కంపిస్తుండటంతో చైనీయులు ఆందోళన చెందుతున్నారు. భూకంపాల ధాటికి ఇప్పటి వరకు చైనాలో ముగ్గురు చనిపోగా  27 మంది గాయపడ్డారు. వేల సంఖ్యలో ఇళ్లు భూకంప తీవ్రతకు దెబ్బ తిన్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. శుక్రవారం సాయంత్రం నుంచి చైనాలోని దాదాపు 12 కౌంటీల్లో భూమి కంపిస్తోంది. అయితే యంగ్‌బీ, యాంగ్‌ గౌజాంగ్‌ కౌంటీలు భూకంపాల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి.

రిక్టరు స్కేలుపై 5 శాతం కంటె ఎక్కువ తీవ్రతతో వరుసగా నాలుగు సార్లు వచ్చిన భూకంపాలతో యంగ్బీ కౌంటీ తీవ్రంగా నష్టపోయింది. ఇక్కడ ప్రమాద తీవ్రతకు ఇద్దరు చనిపోగా..యాంగ్‌గౌజాంగ్‌ కౌంటీలో ఒక్కరు మరణించారు. దాదాపు 162 సార్లు భూమి కంపించినట్టు సమాచారం. 



(చదవండి: Nepal: కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం)

మరిన్ని వార్తలు