పాకిస్తాన్‌లో పేపర్‌ సంక్షోభం...వచ్చే ఏడాది విద్యా సంవత్సరానికి పుస్తకాలు ఉండవు!

24 Jun, 2022 13:31 IST|Sakshi

No textbooks for students: పాకిస్తాన్‌లో లోపభూయిష్టమైన విధానాలు, ద్రవ్యోల్బణం తదితర కారణాల రీత్యా తీవ్రమైన పేపర్‌ సంక్షోభం తలెత్తింది. దీని ఫలితంగా వచ్చే ఏడాది విద్యాసంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని పాకిస్థాన్ పేపర్‌ అసోసియేషన్‌ అధికారులు చెబుతున్నారు. అదువల్ల స్కూళ్లు ఆలస్యంగా ఆగస్టులో ప్రారంభమవుతాయని పాకిస్థాన్ పేపర్ మర్చంట్ అసోసియేషన్, పాకిస్థాన్ అసోసియేషన్ ఆఫ్ ప్రింటింగ్ గ్రాఫిక్ ఆర్ట్ ఇండస్ట్రీ,  పేపర్ పరిశ్రమకు సంబంధించిన ఇతర సంస్థలు తెలిపాయి.

పేపర్‌ ధర పెరగడం వల్ల ప్రచురణకర్తలు ధరను నిర్ణయించలేకుపోతున్నారని పాకిస్తాన్‌కి చెందిన స్థానికి మీడియా పేర్కొంది. అందువల్లే సింధ్‌, పంజాబ్‌, ఖైబర్‌ పఖ్తుంక్వా వంటి పాఠ్యపుస్తకాల బోర్డులు ఇక ముద్రించలేమని స్పష్టం చేశాయి. దీంతో పాకిస్తాన్‌ కాలమిస్ట్‌ అయాజ్‌ అమీర్‌ దేశంలోని అసమర్థలైన పాలకుల పై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు పాకిస్తాన్‌ గత రుణాలను చెల్లించేందుకు అప్పుల తీసుకునే విషవలయంలో చిక్కుకుపోయిందంటూ ఆవేదన చెందారు.  ప్రస్తుతం ఏ దేశాలు పాకిస్తాన్‌కి రుణ సాయం చేయడానికి ఇష్టపడని దుస్థితలో ఉందని చెప్పారు.

దీన్ని చైనా క్యాష్‌ చేసుకోవాలని ప్రయత్నిస్తుందన్నారు. ఆ దిశగానే రుణాలు, పెట్టుబడుల చెల్లింపుల విషయమై ఈ తరుణంలోనే పాకిస్తాన్‌తో గట్టి బేరం కుదుర్చుకుని పరిస్థితిని చక్కబెట్టుకునేందుకు యత్నిస్తోందన్నారు. ఈ మేరకు పాకిస్తాన్‌ 2021-22 ఆర్థిక సంవత్సారానికి గానూన సుమారు రూ. 30 వేల కోట్ల చైనా ట్రేడ్స్‌ ఫైనాన్స్‌ ఉపయోగించినందుకు సుమారు రూ. వెయ్యి కోట్లు పైనే వడ్డిని చెల్లించిందని నివేదిక పేర్కొంది. 

(చదవండి: యుద్ధం క్లైమాక్స్‌కి చేరుకుంటున్న వేళ...రష్యాకి ఊహించని ఝలక్‌!)

మరిన్ని వార్తలు