షాక్‌లో శాస్త్రవేత్తలు.. బయటపడ్డ 5000 ఏళ్ల నాటి ఫ్రిడ్జ్‌.. అందులో ఏం దాచేవారంటే!

21 Feb, 2023 11:28 IST|Sakshi

చరిత్రను వెలికితీయడంతో పాటు వాటి ఆధారాలను భద్రపరచే లక్ష్యంతో పురావస్తు శాఖ పని చేస్తుంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి వారికి ఆశ్చర్యం కలిగించే ఘటనలు ఎదురవుతుంటాయి. తాజాగా దక్షిణ ఇరాక్‌లో తవ్వకాలు జరుపుతున్న పురావస్తు శాస్త్రవేత్తల బృందానికి అటువంటి అనుభవమే ఎదురైంది. దాదాపు 5000 సంవత్సరాల నాటి రెస్టారెంట్‌ అవశేషాలు బయటపడ్డాయి.

5వేల ఏళ్ల నాటి ఫ్రిడ్జ్‌..
వివరాల్లోకి వెళితే.. సుమేరియన్ నాగరికతకు ముఖ్యమైన కేంద్రంగా పిలిచే పురాతన లగాష్ శిధిలాల మధ్య పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు ప్రారంభించారు. ఈనేపథ్యంలో ఇటీవల అక్కడ 5వేల ఏళ్ల నాటి రెస్టారెంట్‌ను కనుగొన్నారు. అందులో ఆ కాలం నాటి ఓవెన్, కొన్ని బెంచీలు, గిన్నెలు, ఇతర పాత్రలలో బయటపడ్డాయి. అన్నింటికంటే విచిత్రంగా ‘జీర్‌’ అనే పిలిచే మట్టి రిఫ్రిజిరేటర్‌ బయట పడటం శాస్త్రవేత్తలును ఆశ్చరపరిచింది.

ఆ ఫ్రిజ్‌లో బీర్‌ను దాచినట్టు వారికి రుజువులు కూడా దొరికాయి. అంతేకాకుండా ఆ పురాతన బీర్‌ తయారు చేసే ఒక రెసిపీని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్న‍ట్లు చెప్పారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, పిసా విశ్వవిద్యాలయ బృందాల సంయుక్త ప్రయత్నాల ఫలితంగా ఈ ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి. ఈ తవ్వకాల ఆ బృందం.. డ్రోన్ ఫోటోగ్రఫీ, థర్మల్ ఇమేజింగ్, మాగ్నెటోమెట్రీ, మైక్రో-స్ట్రాటిగ్రాఫిక్ శాంప్లింగ్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకున్నారు.

మరిన్ని వార్తలు