137 టన్నుల బండ రాయి.. పిల్లలు కూడా సింపుల్‌గా జరపగలరు.. కారణం తెలుసా?

27 Feb, 2022 08:22 IST|Sakshi

తన చిటికెన వేలితో కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తినట్లు.. మీరు కూడా వంద టన్నుల బరువైన ఓ బండరాయిని కదిలించగలరు. ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఫ్యాక్టే ఇది. ఫ్రాన్స్‌లోని హుయెల్‌గోట్‌ అడవిలో ‘షేకింగ్‌ రాక్‌’ పేరుతో ఓ బండరాయి ఉంది. ఏడు మీటర్ల పొడవు, 137 టన్నుల బరువైన ఈ రాయిని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు గుర్తించి, ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు.. ఈ రాయిని కదిలించడానికి కండలు తిరిగిన శరీరం ఉండాల్సిన పనిలేదు.. పిల్లలు కూడా కదలించవచ్చు అని. (చదవండి: Russian Ukraine War: 19 ఏళ్ల బంధం.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ముచ్చటైన కుటుంబం! ఆయన భార్య ఎవరంటే! )

కేవలం రాయి ఉండే కోణం, ప్రదేశం కారణంగానే ఇది సాధ్యమవుతోందని, అడవి నుంచి బయటకు తీసుకొస్తే ఆ ప్రత్యేకత పోతుందని బండరాయిని అక్కడే ఉంచారు. అప్పటి నుంచి రోజూ ఈ రాయిని చూడ్డానికి ఎంతోమంది వస్తున్నారు. 


మ్యాజిక్‌ చేసేవారు చిన్న చిన్న లాజిక్స్‌ ఉపయోగించి అసాధ్యాన్ని సుసాధ్యంగా భ్రమింప చేస్తున్నట్లు... మీరెప్పుడైనా ఫ్రాన్స్‌కు ప్రయాణమైతే అ అడవికి వెళ్లి చిన్న లాజిక్‌ను వాడి ఆ బండరాయిని కదిలించి ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేసుకోండి.

మరిన్ని వార్తలు