Shree Saini : మిస్‌ వరల్డ్‌ అమెరికాగా తొలిసారి భారత సంతతి అమెరికన్‌

4 Oct, 2021 18:59 IST|Sakshi

న్యూయార్క్‌: మిస్‌ వరల్డ్‌ అమెరికా 2021ని గెలుచుకున్న తొలి భారత సంతతి అమెరికన్‌గా శ్రీ సైనీ నిలిచింది. వాషింగ్టన్‌కి చెందిన శ్రీసైని ప్రపంచ స్థాయిలోనిర్వహించిన ఈ పోటీలో అమెరికాకు ప్రాతినిథ్యం వహించిన తొలి భారత సంతతి అమెరికన్‌ కావడం విశేషం. అయితే ఆమెకు 12 ఏళ్ల వయసులో జరిగిన కారు ప్రమాదంలో ఎడమవైపు భాగం ముఖంతో సహా అంతా కాలిపోయింది. పైగా ఆమె జీవితాంత పేస్‌మేకర్‌ (కృత్రిమ గుండె) సాయంతోనే బతకాలి అయినప్పటికీ  వీటిన్నంటిని అధిగమించి మరీ మిస్‌ వరల్డ్‌ అమెరికా కిరీటాన్ని గెలుచుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

(చదవండి: తక్షణమే చర్యలు తీసుకుంటాం!)

ఈ మేరకు లాస్‌ ఏంజెల్స్‌లోని మిస్‌ వరల్డ్‌ అమెరికా ప్రధాన కార్యాలయంలో డయానా హెడెన్‌ శ్రీ సైనికి ఈ కిరీటాన్ని బహుకరించింది. ఈ సందర్భంగా శ్రీ సైని మాట్లాడుతూ......." నేను గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నాభావాలను మాటల్లో చెప్పలేను. ఈ క్రెడిట్‌ అంతా మా అమ్మనాన్నలకే దక్కుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కినందుకు మిస్‌ వరల్డ్‌ అమెరికాకు ధన్యావాదులు" అంటూ తన సంతోషాన్ని వ్యక్త చేసింది. శ్రీ ఫోర్డ్స్ సిటీ ఆఫ్ న్యూజెర్సీలో జరిగిన పోటీలో శ్రీ  'మిస్ ఇండియా వరల్డ్‌ వైడ్ 2018' కిరీటాన్ని కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మిస్‌ వరల్డ్‌ అమెరికా ఇన్‌స్టాగ్రామ్‌లో "మిస్‌ వరల్డ్‌ అమెరికా వాషింగ్టన్‌ అయిన శ్రీ 'ఎండబ్ల్యూఏ నేషనల్‌ బ్యూటీ అంబాసిడర్‌' అనే ప్రతిష్టాత్మక స్థానంలోఉంది, ఆమె నిరంతరం చేసిన సేవా కార్యక్రమాల కారణంగా ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని గెలుచుకుంది. అంతేకాదు డాక్టర్లు అందుబాటులోలేని ప్రాంతాల్లో ఆమె కనబర్చిన సేవ దృక్పథాన్ని యూనిసెఫ్‌, సుసాన​ జి కొమెన్‌(యూఎస్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌) వంటి ఇతర సంస్థలు గుర్తించాయి. అందం గురించి మంచి నిర్వచనాన్ని ఇవ్వడమే కాక, మిస్‌ వరల్డ్‌ అమెరికా మిషన్‌ పట్ల అవగాహన కలిగిస్తుంది" అని ప్రశంసించింది.

A post shared by Shree Saini👑Miss World America (@shreesaini)

(చదవండి: పుట్టుకతోనే చేతుల్లేవు.. కానీ చాలానే సాధించింది!)

మరిన్ని వార్తలు