రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

19 Sep, 2020 04:51 IST|Sakshi

ప్రతీ ఏడుగురు వలంటీర్లలో ఒకరికి దుష్ప్రభావాలు 

టీకా భద్రతపై అనుమానాలు

మాస్కో: రష్యా కరోనా టీకా స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ భద్రతపై అనుమానాలు నెలకొ న్నాయి. టీకా డోసులు తీసుకున్న ప్రతీ ఏడుగురు వలంటీర్లలో ఒకరికి సైడ్‌ ఎఫెక్ట్‌లు వచ్చినట్టుగా రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా 40 వేల మందికి టీకా డోసులు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వారిలో ఇప్పటివరకు 300 మందికి వ్యాక్సిన్‌ ఇస్తే వారిలో 14 శాతం మందిలో సైడ్‌ ఎఫెక్ట్‌లు కనిపించాయి.

మొదటి డోసు తీసుకున్న వారిలో 14శాతం మందికి నిస్సత్తువ, కండరాల నొప్పులు వంటివి వచ్చాయని, జ్వరం కూడా ఎక్కువగానే వచ్చినట్టుగా ఆరోగ్య మంత్రి మురాషఖో తెలిపారు. 21 రోజుల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి రెండో డోసు టీకా ఇస్తామని చెప్పారు. స్పుత్నిక్‌ వీ కరోనా వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు ఇంకా పూర్తి కాకముందే రష్యా ప్రభుత్వం వ్యాక్సిన్‌ని హడావుడిగా మార్కెట్‌లో విడుదల చేసింది.

ప్రపంచంలోనే మొదటి వ్యాక్సిన్‌ తెచ్చిన దేశంగా నిలవాలన్న ఉద్దేశంతో త్వరితగతిన అనుమతులు మంజూరు చేసినట్టుగా విమర్శలు వచ్చాయి. మాస్కోలో సెప్టెంబర్‌ మొదట్లో తుది దశ ప్రయోగాలు మొదలు పెట్టారు. టీకా భద్రత, నాణ్యతపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగకుండా మార్కెట్‌లోకి విడుదల చేయ డంపై ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలు అభ్యంతరాలు హెచ్చరికలు జారీ చేశారు. భా రత్‌కి కోటి డోసులు ఇవ్వడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌తో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. డీజీసీఐ అనుమతులు రావాల్సిన నేపథ్యంలో సైడ్‌ ఎఫెక్ట్‌లు రావడం ఆందోళన కలిగిస్తోంది.

>
మరిన్ని వార్తలు