నెహ్రూస్‌ ఇండియా, ఎంపీల నేరచరిత్రపై వ్యాఖ్యలు చేసిన సింగపూర్‌ పీఎం... తప్పుబట్టిన భారత్‌!

18 Feb, 2022 11:26 IST|Sakshi

India has slammed the Singapore Prime Minister's comments: సింగపూర్ పార్లమెంట్‌లో సిటీ-స్టేట్‌లో ప్రజాస్వామ్యంపై ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతదేశ మొదటి ప్రధానమంత్రి గురించి ప్రస్తావించారు. నెహ్రూస్‌ భారత్‌లో లోక్‌సభలో దాదాపు సగం మంది ఎంపీలపై అత్యాచారం హత్య ఆరోపణలతో సహా క్రిమినల్ అభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు వీటిలో చాలా మటుకు రాజకీయ ఆరోపణలు కూడా ఉన్నాయని లీ అన్నారు.

ఈ వ్యాఖ్యలను సింగపూర్ పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యం ఎలా పని చేయాలనే అంశంపై  జరిగిన ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా లీ ఈ వ్యాఖ్యలు చేశారు. "చాలా దేశాలు  ఉన్నతమైన ఆదర్శాలు. గొప్ప విలువల ఆధారంగా ఏర్పడినవే కానీ ఆ తర్వాత రానురానూ రాజీకీయ ఆకృతి మారుతోంది. చాలా రాకీయ పార్టీలు తమ వ్యవస్థాపక నాయకులను విస్మరిస్తోంది." అని లీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈ ప్రసంగంలో ప్రధాని లీ భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూతో సహా వివిధ ప్రధాన మంత్రుల గురించి ప్రస్తావిస్తూ..." చాలా దేశాలు మొదట చాలా ఉద్వేగభరితంగా ఏర్పడ్డాయి.

డేవిడ్ బెన్-గురియన్లు, జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్య్రం కోసం పోరాడి సాధించిన గొప్ప నాయకులు. గొప్ప ధైర్యం అపారమైన సంస్కృతి, అద్భుతమైన సామర్థ్యం కలిగిన అసాధారణ వ్యక్తులు. అంతేకాదు వారు అపారమైన వ్యక్తిగత ప్రతిష్టతో, ధైర్యవంతమైన కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి, దేశంలోని ప్రజల కొత్త భవిష్యత్తును రూపొందించడంలోనూ ప్రజల అంచనాలను అందుకోవడానికి సదా ప్రయత్నిస్తారు. కానీ ఈ ప్రారంభ ఉత్సాహాన్ని తరువాత తరాలకు కొనసాగించడం లేదా నడిపించడంలో విఫలమవ్వడం లేదా కష్టమవుతోంది. అలాగే బెన్-గురియన్స్ ఇజ్రాయెల్ రెండేళ్లలో నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ, కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతోనే సరిపోయిందని, సీనియర్ రాజకీయ నాయకులు అధికారులు నేరారోపణలను ఎదుర్కొన్నారు". అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే సింగపూర్‌లో ప్రజాస్వామ్యం ఎలా ? ఉండాలి, ఆ మార్గంలో  పయనించకుండా ఉండాలంటే ఏం చేయాలని ప్రశ్నించారు. మనమేమి గొప్ప తెలివైనవాళ్లం, ధర్మాత్ములం కాదు కాబట్టి తరం వెంబడి తరం వ్యవస్థను పర్యవేక్షించి దాని నిర్మాణాన్ని కొనసాగిస్తే సాధ్యమవుతుందని లీ పేర్కొన్నారు. ఈ మేరకు భారత్‌ సింగపూర్‌ ప్రధాని లీ   నెహ్రూస్‌ ఇండియా పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిడమే కాక అనవసరమైన వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. అంతేకాదు విదేశాంగ మంత్రిత్వ శాఖ సింగపూర్ హైకమిషనర్‌ను పిలిపించి తమ అభ్యంతరాన్ని తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

(చదవండి: ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రునే నిందిస్తున్నారు: మన్మోహన్‌ సింగ్‌)

మరిన్ని వార్తలు