బంగ్లాదేశ్‌లో నిర్భయ తరహా ఘటన

29 May, 2021 21:05 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఓ 22 ఏళ్ల మహిళపై కదిలే బస్సులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సావర్ ప్రాంతంలో అశులియా పశువుల మార్కెట్ దగ్గరలో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అశులియా పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ జియాల్ ఇస్లాం వివరాల ప్రకారం..బాధితురాలు మణిక్‌గంజ్‌లోని తన సోదరి ఇంటి నుంచి నారాయణగంజ్‌లో ఉన్న ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో ఆమె శుక్రవారం రాత్రి 8 గంటలకు మరో బస్సు కోసం నబినగర్ బస్ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ ఆ మహిళకు  ఇంతకుముందు పరిచయం ఉన్న నజ్ముల్ అనే వ్యక్తి కలిసాడు. ఇద్దరు కలిసి బస్సు కోసం ఎదురు చూస్తుండగా..అక్కడకి వచ్చిన బస్సులో ఎక్కారు.

అయితే నిందితులు బస్సులో ఉన్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలు రాకముందే దించేశారు. అదే సమయంలో నజ్ముల్‌, బాధితురాలని అడ్డుకుని తిరిగి నబినగర్‌ తీసుకెళ్లారు. అక్కడ ఆరుగురు దుండగులు బస్సులో ఆమెపై అత్యాచారం చేశారు. ఆ సమయంలో నజ్ముల్‌ అరుపులు విని పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులు వచ్చి వాహనాన్ని ఆపి వారిని రక్షించారు. బస్సును అదుపులోకి తీసుకుని నిందుతులను అరెస్ట్‌ చేశారు. కోర్టు వారిని ప్రశ్నించడానికి నాలుగు రోజుల రిమాండ్‌ విధించింది. కాగా ఆరుగురు నిందితులను ఆర్యన్(18), షాజు(20), సుమోన్ మియా(24), మోనోవర్(24), షోహాగ్(25), సైఫుల్ ఇస్లాం(40) గా గుర్తించినట్లు పోలీసుల తెలిపారు. వీరంతా తురాగ్ ప్రాంతంలోని కమర్‌పారా నివాసితులుగా పేర్కొన్నారు.

(చదవండి: పార్టీ పేరుతో రచ్చ..150 మంది అరెస్ట్‌)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు