ఆ దేశంలో స్నానం చేయక పోయినా... నవ్వినా.. జైలుకే తెలుసా!

12 Jun, 2022 21:21 IST|Sakshi

ప్రపంచంలో ప్రతి దేశానికి కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలు ఆయా దేశాల్లోని ప్రజలందరూ ఇబ్బందిపడకుండా అనుసరించే విధంగా చేసుకుంటారు. కొన్ని దేశాల్లోని చట్టాలు చూస్తే చాలా వింతగానూ, నవ్వు వచ్చే విధంగానూ ఉంటాయి. ఎందుకిలాంటి చట్టాలు పెట్టారని అనే సందేహం కూడా కలుగుతుంది. ఆ చట్టాలేంటో? ఏమిటా కథ చూసేద్దామా!

ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని వింత చట్టాలు, రూల్స్‌ ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. ఇంగ్లండ్‌లోని మసాచుసెట్స్‌లో ఓ విచిత్రమైన చట్టం ఉంది. ఇక్కడ స్నానం చేయకుండా నిద్రపోతే జైల్లో పెట్టాస్తారట. స్నానం చేయకపోతే జైల్లో పెట్టడమేంటి రా బాబు అనుకోకండి. ఎందుకంటే ఆ దేశంలో దాన్ని చాలా తీవ్రంగా పరిగణించటమే కాదు చట్టవిరుద్ధంగా భావిస్తారట. చాలా ఫన్నీగా ఉంది కదూ.

అలాగే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఎవరైనా కారును లోదుస్తులతో శుభ్రం చేయడం వంటివి చేస్తే జరిమానా విధిస్తారు. ఇటలీలోని మిలాన్ నగరంలో అయితే నవ్వు పైన నిషేధం. ఆ దేశంలో ఎవరైన నవ్వినట్టు కనిపిస్తే ఫైన్‌ వేస్తారట. ఈ చట్టాలను చూస్తే చాలా కామెడీగా ఉన్నాయి కదా. ఐతే ఆయా చట్టాల వల్ల ప్రయోజనం ఏంటో తెలయదు గానీ ఆయా దేశాల ప్రజలు మాత్రం ఈ వింత చట్టాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. 

(చదవండి: బనానా రికార్డు! అరటి పళ్ల ప్రదర్శన)

మరిన్ని వార్తలు