ఇదేం విడ్డూరం: మంచి భర్త రావాలంటే గుండు చేయించుకోవాల్సిందే

20 Sep, 2021 14:31 IST|Sakshi

కేప్‌టౌన్‌: వివాహం అంటే ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాదు.. రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తుంది. వివాహం అంటే ఓ ప్రమాణం. జీవితాంతం నీ చేతిని విడవను.. అన్ని వేళలా నీకు తోడుగా ఉంటానని హామీ ఇవ్వడం. ప్రపంచవ్యాప్తంగా పెళ్లి అంటే ఇదే భావన కనిపిస్తుంది. విశ్వవ్యాప్తంగా వివాహ బంధానికి ఒక్కటే అర్థం ఉన్నప్పటికి.. పెళ్లి తంతు మాత్రం ప్రాంతాలను బట్టి మారుతుంటుంది. వివిధ దేశాల్లో.. వేర్వేరు సమూహాల్లో వేర్వేరు ఆచారాలను పాటిస్తారు. వీటిలో కొన్ని చాలా వింతగా ఉంటాయి. పాటించడం కూడా చాలా కష్టం. అలాంటి ఓ వింత ఆచారం గురించి ఇప్పుడు మీరు చదవబోతున్నారు.ఆ వివరాలు.. 

మంచి భర్త రావాలంటే గుండు చేయించుకోవాలి
పెళ్లి అనగానే ఎక్కువ ప్రాధాన్యత అలంకరణకే ఇస్తారు. మరీ ముఖ్యంగా కేశాలంకరణకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక జుట్టు అంటే ఆడవారికి కాస్త ఎక్కువ అభిమానం. ఎంతో జాగ్రత్తగా కేశాలను సంరక్షించుకుంటారు. అంత జాగ్రత్తగా చూసుకునే జుట్టును పెళ్లి కోసం కత్తిరించడం.. గుండు చేయించడం వంటివి చేయాలంటే.. వినడానికే చాలా బాధగా ఉంది కదా. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన కొన్ని తెగల్లో ఆడవారు పెళ్లి తర్వత జుట్టు పెంచడానికి వీల్లేదు. వివాహానికి ముందే కత్తిరించడం, గుండు చేయించుకోవడం చేయాలి.
(చదవండి: అరుదైన వ్యాధి: వృద్ధురాలిగా జన్మించిన చిన్నారి)

బొరానా తెగ వాసుల వింత ఆచారం
దక్షిణాఫ్రికాలోని ఇథోపియా, సోమాలియా దేశాల్లో స్థిరపడిన బొరానా తెగ ప్రజల్లో ఈ వింత ఆచారం ఉంది. ఈ తెగ ప్రజలు మొత్తం 500 మంది ఉంటారు. పితృస్వామ్య వ్యవస్థ. గ్రామం, జంతువులు, పరివారం బాధ్యతలన్నింటిని పురుషులే చూసుకుంటారు. ఆడవారు కేవలం ఇంటిని అలంకరించడం.. సంప్రదాయాలను పాటించడం మాత్రమే ఆడవారి బాధ్యత. 
(చదవండి: రివర్స్‌ జూ: బోనులో మనం.. స్వేచ్ఛగా సింహాలు)

ఎంత ఎక్కువ జుట్టు కత్తిరిస్తే.. అంత మంచి భర్త
ఇక ఈ తెగలో ఉన్న వింత ఆచారం ఏంటంటే.. పెళ్లికి ముందు వరకు మాత్రమే ఆడపిల్లలకు జుట్టు పెంచుకునే అవకాశం కల్పిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయంటే.. ఇకఅమ్మాయిలు వారి జుట్టును కత్తిరించుకోవాల్సిందే. ఇదేం విడ్డూరం అంటే.. మంచి భర్త కోసం ఇలా చేయక తప్పదంటారు ఇక్కడి ప్రజలు. ఎంత ఎక్కువ జుట్టు కత్తిరించుకుంటే అంత మంచి వరుడు దొరుకుతాడని.. ఏకంగా గుండు చేయించుకుంటే.. వారికి మంచి భర్త, అత్తింటి వారు లభిస్తారని బొరానా ప్రజల విశ్వాసం. అందుకే ఇక్కడ పెళ్లైన ఆడవారు గుండుతో.. లేదంటే పొట్టి జుట్టుతో దర్శనమిస్తారు. 
(చదవండి: కొన్ని క్షణాలపాటే నిల్చుంది.. క్లిక్‌మనిపించాడు!)

ఎంత పొడవు జుట్టుంటే అంత అదృష్టవంతుడు
ఇక్కడ మరో వింత ఆచారం ఏంటంటే.. ఫోటోలు దిగకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వారి శరీరం అంతా రక్తంతో తడిసిపోతుందని భావిస్తారు. ఇక్కడ మరో వింత ఆచారం ఏంటంటే.. మంచి భర్త కోసం ఆడవారు గుండు చేయించుకుంటే.. పొడవు జుట్టు ఉన్న వ్యక్తిని ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తారు ఇక్కడి జనాలు. 

చదవండి: 41 మంది మహిళలపై అత్యాచారాలు.. వెయ్యేండ్ల జైలు శిక్ష

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు