భార్యకు వాలెంటైన్స్‌ డే గిఫ్ట్‌గా ఓ ప్రాణం

22 Feb, 2021 17:59 IST|Sakshi
మెరెలిజె వాన్‌ డెర్‌ మెర్వే... చేతిలో జిరాఫీ గుండెతో మెరెలిజె వాన్‌ డెర్‌ మెర్వే

కేప్‌టౌన్‌ : ఎదుటి వ్యక్తి మీదున్న ప్రేమను తెలియజేయటానికి కానుకలు ఇవ్వటం పరిపాటి. వాలెంటైన్స్‌ డే రోజున ఇష్టమైన వారికోసం ఏమివ్వాలా అని ఆలోచించి.. వారికిష్టమైనదేదో తెలుసుకుని దాన్ని బహుమతిగా ఇస్తుంటారు. సౌత్‌ ఆఫ్రికాకు చెందిన ఓ భర్త కూడా అలానే చేశాడు. ఓ జంతువు ప్రాణాన్ని ఆమెకు కానుకగా ఇచ్చాడు. దాన్ని వేటాడి చంపే అవకాశాన్ని కలిగించాడు. వివరాల్లోకి వెళితే.. సౌత్‌ ఆఫ్రికా, లిమ్‌పోపో ప్రావిన్స్‌కు చెందిన మెరెలిజె వాన్‌ డెర్‌ మెర్వే(32)కు జంతువులను వేటాడ్డం అంటే మహా సరదా. తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పటినుంచి వేటాడుతోంది. ఓ బలిష్టమైన నల్ల జిరాఫీని చంపాలని 2016నుంచి అనుకుంటోంది. 2017లో అవకాశం చేతి వరకు వచ్చి జారిపోయింది. అప్పటినుంచి వెయ్యి కళ్లతో జిరాఫీకోసం వెతకసాగింది. రెండు వారాల క్రితం ఓ వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేసి జిరాఫీ ఆచూకీ చెప్పాడు.  ( వైరల్‌: మీరు ఊహించని టైటానిక్‌ మరో క్లైమాక్స్)

వేటాడిన జిరాఫీతో మెరెలిజె వాన్‌ డెర్‌ మెర్వే

దీంతో తన కోరిక గురించి భర్త గెర్‌హర్డెన్ట్‌ నెల్‌కు వివరించింది. వాలెంటైన్స్‌ డే రోజు భార్యను సన్‌ సిటీలోని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు తీసుకెళదామనుకున్న అతడు.. తన ప్లాన్‌ను రద్దు చేసుకున్నాడు. అందుకు బదులు జిరాఫీని చంపటానికి భార్యకు అవసరమైన డబ్బులు ఇచ్చాడు. మెరెలిజె వాన్‌ డెర్‌ మెర్వే జిరాఫీ ఉంటున్న అడవిలోకి వెళ్లి దాన్ని వేటాడి చంపింది. దాని గుండెను బయటకు తీసిన తర్వాత చేతుల్తో పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు