Lake Macdonnell: అద్భుతం... ఇది గ్రాఫిక్‌ కాదు.. అచ్చంగా ఒరిజినలే!

3 Sep, 2021 09:37 IST|Sakshi

కొన్ని చూస్తే.. మన కళ్లను మనం నమ్మలేం.. అలాంటిదే ఈ చిత్రం కూడా.. ఇది గ్రాఫిక్‌ కాదు.. కెమెరా ఎఫెక్ట్‌ అసలే కాదు.. అచ్చంగా ఒరిజినలే. దక్షిణ ఆస్ట్రేలియాలోని పెనాంగ్‌కు వెళ్తే.. ఈ అద్భుతాన్ని మీరు కూడా చూడవచ్చు.  

ఇది లేక్‌ మెక్‌డోనెల్‌. ఇదో ఉప్పునీటి సరస్సు. ఒకరకమైన నాచు, అలాగే ఒకరకమైన బ్యాక్టీరియా వల్ల దీనికి ఈ రంగు వస్తుంది.


ముఖ్యంగా ఈ హాలోబ్యాక్టీరియా ఎర్రరంగు పిగ్మెంట్స్‌(కణాలు)ను విడుదల చేస్తుంది. అందుకే ఈ సరస్సు ఇలా గులాబీ రంగులో కనిపిస్తుంది.

చదవండి: WHO-Covid 19 MU Variant: టీకాలకు లొంగని కోవిడ్‌ ఎంయూ వేరియంట్‌!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు