మూన్‌ జే-ఇన్‌ కీలక నిర్ణయం.. ఇక కుక్కల మాంసం బంద్‌!

28 Sep, 2021 11:50 IST|Sakshi

సియోల్‌: దక్షణి కొరియా ప్రెసిడెంట్‌ మూన్‌ జే-ఇన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కుక్క మాంసం తినడాన్ని నిషేదిస్తున్నట్లు సోమవారం ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కుక్క మాంసం చాలాకాలంగా దక్షిణ కొరియా వంటకాలలో భాగంగా ఉంది. అక్కడ సంవత్సరానికి సుమారు 1 మిలియన్‌ కుక్కలు తింటారని అంచనా. అయితే మనుషులు కాలక్రమేణా పశువుల కంటే ఎక్కువగా జంతువులను సహచరులుగా చూస్తుండటంతో వీటి వినియోగం తగ్గింది. 

సోమవారం జరిగిన వారాంతపు సమావేశంలో మూన్‌ ప్రధానమంత్రి కిమ్‌ బూ-క్యూమ్‌తో మాట్లాడుతూ.. కుక్క మాంసం వినియోగం నిషేదించడాన్ని వివేకంతో పరిగణించాల్సిన సమయం రాలేదా? అంటూ ప్రశ్నించారు. మరోవైపు జంతు హక్కుల కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. దక్షిణ కొరియలో పెంపుడు జంతువులను పెంచకోవడం, ఇంట్లో కుక్కలతో నివసించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ ఒక​ ప్రసిద్ధ జంతు ప్రేమికుడు. ఆయన కార్యాలయంలో అనేక కుక్కలను పెంచుకుంటున్నారు.  చదవండి: (సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం.. 250 ఏళ్ల చరిత్రలో)

దక్షిణ కొరియా జంతు సంరక్షణ చట్టం.. ప్రధానంగా కుక్కలు, పిల్లుల క్రూరమైన వధను అడ్డుకోవడానికి ఉద్దేశించబడిందే కానీ వినియోగాన్ని నిషేధించదు. ఈ నెలలో చేసిన ఓ సర్వే రిపోర్ట్ ప్రకారం 78% మంది కుక్క, పిల్లి మాంసం ఉత్పత్తులను, విక్రయాలను నిషేదించాలని కోరగా, 49% మంది మాంసం వినియోగ నిషేదాన్ని సమర్థించారు. అయితే మాంసం విక్రేతలు తమ వృత్తిపై హక్కు కోసం పట్టుబడుతూ, వారి జీవనోపాధి ప్రమాదంలో ఉందని చెప్తున్నారు.  చదవండి:  (చైనాను బూచిగా చూపుతున్నాయి!) 

మరిన్ని వార్తలు