దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ

10 Mar, 2022 08:47 IST|Sakshi

సియోల్‌: దక్షిణ కొరియా దేశాధ్యక్ష ఎన్నికలు బుధవారం జరిగాయి. ఈ దఫా ప్రధాన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నెలకొందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రీ ఎలక్షన్‌ సర్వేలో అధికార డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి లీ జే మైంగ్,ప్రతిపక్ష పీపుల్స్‌ పవర్‌ పార్టీ అభ్యర్థి జనరల్‌ యూన్‌ సుక్‌ యేల్‌లు ఇతర అభ్యర్థుల కన్నా ముందంజలో ఉన్నారని తేలింది. ఎన్నికల అనతరం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌లో జనరల్‌ యూన్‌కు 48.4 శాతం, లీ కి 47.8 శాతం ఓట్లు వచ్చాయి. బుధవారం ఎన్నికలో సుమారు 77 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో గెలుపొందినవారు మేలో అధ్యక్ష పదవి చేపడతారు.  

మరిన్ని వార్తలు