ఎలోన్ మస్క్ 'స్పేస్‌ఎక్స్' సరికొత్త రికార్డ్!

26 Jan, 2021 17:37 IST|Sakshi

ఎలోన్ మస్క్ కు చెందిన 'స్పేస్‌ఎక్స్' కంపెనీ మరో చరిత్ర సృష్టించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బ్రేక్ చేసి.. ఇప్పుడు స్పేస్‌ఎక్స్ సరికొత్త రికార్డును తన పేరున లిఖించుకుంది. ఎలోన్ మస్క్ యొక్క స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ విజయవంతంగా ఒకేసారి 143 ఉపగ్రహాలను అంతరిక్షకక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. దీంతో 2017 ఫిబ్రవరిలో 104 శాటిలైట్స్ ను ప్రవేశ పెట్టి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పేరిట ఉన్న రికార్డ్ బద్దలైంది. ఇప్పడు అంతరిక్షంలోకి అత్యధిక ఉపగ్రహాలను ప్రయోగించే విషయంలో యుద్ధం మొదలైనట్లు అనిపిస్తుంది.(చదవండి: ఆకాశ్-ఎన్‌జీ క్షిపణి పరీక్ష విజయవంతం)

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని కేప్ కెనవరాల్ నుంచి ఈ ప్రయోగాన్ని స్పేస్‌ఎక్స్ చేపట్టింది. ఈ ప్రయోగం పేరు ట్రాన్స్‌పోర్టర్-1. ఈ ప్రయోగంలో భాగంగా ప్రైవేట్, ప్రభుత్వానికి చెందిన మొత్తం 143 ఉపగ్రహాలను 90 నిమిషాల్లో అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టారు. ఈ ఉపగ్రహాలలో క్యూబ్‌శాట్స్, మైక్రోసాట్స్, 10 స్టార్‌లింక్ ఉపగ్రహాలు ఉన్నాయి. సుమారు 30 నిమిషాల లిఫ్ట్-ఆఫ్ తర్వాత ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడం జరిగింది.  స్పేస్‌ఎక్స్ తన స్మాల్‌శాట్ రైడ్ షేర్ ప్రోగ్రాం కింద ఈ ప్రయోగాన్ని మొదటిసారిగా చేపట్టింది. ఈ ప్రయోగంలో భాగంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి 200కిలోగ్రాములకు లక్ష్య డాలర్ల రుసుము వసూలు చేసినట్లు సమాచారం. స్పేస్‌ఎక్స్ తక్కువ ధరకే ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుంది. 
 

మరిన్ని వార్తలు