అమెరికా, రష్యా, యూఏఈల వ్యోమగాములతో..

3 Mar, 2023 05:15 IST|Sakshi

ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌

కేప్‌ కెనవెరాల్‌: అరబ్‌ దేశాల నుంచి మొట్టమొదటి వ్యోమగామి సహా మూడు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కు చేరుకుంది. ఆరు నెలల ఈ మిషన్‌లో యూఏఈ రెండో వ్యోమగామి సుల్తాన్‌ అల్‌–నెయాడీ పాలుపంచుకుంటున్నారు.

నెయాడీతోపాటు అమెరికాకు చెందిన స్టీఫెన్‌ బోవెన్, వారెన్‌ హొబర్గ్, రష్యాకు చెందిన అండ్రీ ఫెడ్యాయెవ్‌ ఉన్నారు. వీరు అక్కడికి చేరుకున్నాక ఐఎస్‌ఎస్‌లో గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఉంటున్న అమెరికా, రష్యా, జపాన్‌ వ్యోమగాములు భూమిపైకి చేరుకోవాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు