ప్రపంచంలోనే భారీ రాకెట్‌ ప్రయోగం విఫలం.. ఎలన్‌ మస్క్‌కు ఎదురుదెబ్బ

20 Apr, 2023 19:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎలన్‌ మస్క్‌కు భారీ షాక్‌ తగిలింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ కంపెనీ రూపొందించిన అతిపెద్ద రాకెట్‌ నింగిలోకి ఎగిసిన కాసేపటికే.. పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఇదిలా ఉండగా, స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్.. భారీ ఖర్చుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత శక్తివంతంగా నిర్మించిన రాకెట్. దీన్ని.. అంతరిక్షంలోకి వ్యోమగాములు, సరకు రవాణా కోసం రూపొందించారు. 400 అడుగులు పొడువున్న భారీ వ్యోమనౌక దాదాపు 250 టన్నుల బరువును మోయగలదు. 100 మందిని అంతరిక్షయానానికి తీసుకెళ్లగలదు. చంద్రుడు, అంగారకుడిపై యాత్రలకు వీలుగా దీన్ని రూపొందించారు. నాసా చంద్రుడి ప్రయోగాలకు పోటీగా.. మస్క్‌ దీనిని తెరపైకి తెచ్చాడనే చర్చ జోరుగా నడిచింది కూడా.  

ఈ రాకెట్‌ టెక్సాస్‌లోని బోకా చికాలోని ప్రైవేట్ స్పేస్‌ఎక్స్ స్పేస్‌పోర్ట్ అయిన స్టార్‌బేస్ నుండి ప్రయోగించబడింది. ఈ సందర్బంగా విఫలం కావడంతో పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ సందర్బంగా రాకెట్‌ విఫలం కావడంపై స్పేస్‌ఎక్స్‌ స్పందించింది. ట్విట్టర్‌ వేదికగా.. భారీ రాకెట్‌ భాగాలు విడిపోయే క్రమంలో పేలిపో​యినట్టు తెలిపింది. రాకెట్‌  విఫలమైనట్టు పేర్కొంది.  

మరిన్ని వార్తలు