ఇంటి పనికే పరిమితమైన భార్యకు కోటి రూపాయాలు చెల్లించమన్న కోర్టు!

8 Mar, 2023 09:40 IST|Sakshi

ఇటీవల కాలంలో జంటలు పలు కారణాల రీత్యా విడిపోతుండటం చూస్తున్నాం. ఐతే విడిపోయేటప్పుడూ భర్త మాత్రం పెద్ద మొత్తంలో భార్యకు భరణం చెల్లించాల్సిందే. అది అందరికీ తెలిసిందే. ఇక్కడమ మాత్రం కోర్టు చాలా విచిత్రమైన అంశం లేవనెత్తి..గొప్ప తీర్పు ఇచ్చింది. ఇక్కడొక జంట ఏవో కారణాల రీత్యా విడాకుల కోసం కోర్టు మెట్లేక్కారు. అయితే ఆ కోర్టు భర్తకు ఊహించని షాక్‌ ఇచ్చింది. అలా ఇలాకాదు ఇన్నాళ్లు తనకు జీతభత్యం లేకుండా ఇంటి పనిచేసి, కుటుంబాన్ని చూసినందుకు కోటీ రూపాయాలు చెల్లాంచమంటూ ఆదేశించింది. ఈఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది.

ఏం జరిగిందంటే...ఓ జంట విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. పెళ్లై ఇన్నేళ్లైనా.. ఆమె ఎలాంటి జీతం భత్యంలేని కుటుంబ సేవకు అంకితమైంది కాబట్టి ఆమెకు వివాహం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ కార్మికుడు ఇచ్చే కనీస వేతనం ప్రకారం ఇవ్వాల్సిన మొత్తం కోటి రూపాయాల లెక్కించింది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇన్నేళ్ల భాగస్వామ్యంలో ఆమెకంటూ ఎలాంటి సంపాదన లేదు. ముఖ్యంగా ఇంటి పనుల్లోనే నిమగ్నమైంది. ఇంటిని, కుటుంబాన్ని చూసుకోవడమే సరిపోయింది.

పిల్లలకు నెలవారి భత్యంతో సహా ఆమె వివాహం జరిగిన సంవత్సరం 1995 నుంచి 2020 వరకు ఆమెకు రోజువారి కూలికి చెల్లించే వేతనం చట్టం ప్రకారం అయినా ఆమెకు చెల్లించాల్సిన మొత్తం లెక్కించి ఇవ్వాల్సిందిగా కోర్టు ఆ భర్తను ఆదేశించింది. ఈ మేరకు సదరు మహిళ మాట్లాడుతూ.. "నా భర్త  బయట ఉద్యోగం చేసేందుకు అనుమతించ లేదు. ఇంటికే పరిమితం చేయడమే గాక తమ స్వంత జిమ్‌లోనే పనిచేసేందుకు అనుమతించేవాడు. తనను కుంటుంబం, ఇల్లు వాటికే పరిమితం అయ్యేలా చేశాడు. నిజంగా నన్ను ఇంకేమి చేయలేని స్థితిలోకి తీసుకొచ్చేశాడు. నిజంగా ఈ తీర్పు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది సరైనదే అని ఆనందంగా చెబుతోందామే". 

(చదవండి: తీవ్ర విషాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్‌ రైలు)

మరిన్ని వార్తలు