వింతైన ట్రిక్‌ : ఇంధనం పొదుపు చేయడం కోసం నెక్‌కి 'టై' ధరించొద్దు!

31 Jul, 2022 13:07 IST|Sakshi

డబ్బలు వృధాగా ఖర్చుపెట్టకుండా ఉండటం కోసం, కాలుష్య నివారణ కోసం తదితర వాటిన్నంటికి నిపుణులు చిన్న లాజికల్‌ ట్రిక్‌లు సూచించడం మాములే. ఇది అందరికి తెలిసిన విషయమే. ఐతే రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు, ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిదేశం ఈ సంక్షోభం తలెత్తకుండా ఉండేలా తమదైన తరహాలో పద్ధతులను అవలంబిస్తున్నాయి. ఐతే ఈ విషయమై స్పెయిన్‌ ప్రధాని తమ ప్రజలకు ఒక విభిన్నమైన ట్రిక్‌ అనుసరించమని సూచించాడు. ఆ ప్రధాని చెప్పిన పరిష్కార మార్గం వింటే చాలా వింతగానూ, అర్థం లేనిదిగానూ అనిపిస్తుంది.

వివరాల్లోకెళ్తే...స్పానిష్‌ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తమ దేశ ప్రజలకు ఇంధనాన్ని సాధ్యమైనంత మేర తక్కువగానే వినియోగించుకోవాలంని విజ్ఞప్తి చేశాడు. పైగా వృధాగా ఇంధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండేందుకు ఇలా చేయండి అంటూ ఒక వింతైన ట్రిక్‌ గురించి చెప్పాడు. ఈ మేరకు ఆయన విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ...  ఇంధనాన్ని ఆదా చేసేందుకు నెక్‌కి 'టై' లు ధరించవద్దని చెప్పాడు.

అంతేకాదు ఆయన కూడా  ఆ ప్రసంగంలో నెక్‌కి టై ధరించకుండా ఉన్నాడు.  ఇంధనం ఆదా చేయడానికికి నెక్‌కి టై ధరించకపోవడానికిక సంబంధం ఏమిటో అర్థం కాదు ప్రజలకు. అంతేకాదు తాను కూడా టైం ధరించకపోవడాన్ని గమనించండని చెబుతుంటాడు. అంతేకాదు తన ప్రజలను మంత్రులను దీన్ని అనుసరించాలని కూడా కోరాడు. ఐతే స్పెయిన్‌ ప్రధాని సాంచెజ్‌ దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు సమాచారం.

అధిక ఉష్ణోగ్రతలు కారణంగా స్పెయిన్‌ ప్రజలు ఎయిర్‌ కండిషనింగ్‌ పై ఆధారపడుతున్నారు. దీంతో దేశంలో గృహాలకు, వ్యాపార కార్యాలయాలకు అధిక ఇంధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాదు యూటీలిటీ బిల్లులను తగ్గించడంతోపాటు ఇంధనం కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ఈ పొదుపు ప్రణాళిక ట్రిక్‌ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

(చదవండి: భూ వాతావరణంలోకి చైనా రాకెట్‌ శకలాలు.. వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు