95% ప్రభావవంతంగా కరోనా వ్యాక్సిన్‌..! 

25 Nov, 2020 06:54 IST|Sakshi

మాస్కో: రష్యా రూపొందించిన స్పుత్నిక్‌ 5 కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఉత్పత్తిదారులు తెలిపారు. రెండు డోసుల్లో ఇచ్చే ఈ టీకాను అంతర్జాతీయ మార్కెట్లో 10 డాలర్ల లోపే ఇస్తామని, రష్యా పౌరులకు మాత్రం ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. వ్యాక్సిన్‌ను 2–8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాల్సి ఉంటుందన్నారు. తొలిడోసు ఇచ్చిన 42 రోజుల అనంతరం సేకరించిన డేటా ఆధారంగా టీకా ప్రభావాన్ని లెక్కించామని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, గమలేయా రిసెర్చ్‌ సెంటర్, ఆర్‌డీఐఎఫ్‌ ప్రకటించాయి.  (కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కన్నుమూత)

39 కేసులను పరిశీలించగా తొలి డోసు పూర్తయిన 28 రోజులకు వ్యాక్సిన్‌ 91.4 శాతం ప్రభావం చూపిందన్నాయి. రెండో డోసు ఇచ్చిన తర్వాత, మొత్తంగా 42 రోజుల అనంతరం ప్రభావశీలత 95 శాతం పైనే ఉంటుందన్నాయి. అయితే పూర్తి గణాంకాలను మాత్రం వెల్లడించలేదు.  మరోవైపు అమెరికాలో ఫైజర్‌ టీకా, మోడెర్నా టీకాలు సైతం 95 శాతం మేర ప్రభావం చూపుతున్నట్లు ఆయా ఉత్పత్తిదారులు చెబుతున్నారు. తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ సైతం తమ వ్యాక్సిన్‌ అద్భుతంగా పనిచేస్తోందని ప్రకటించింది.   (ఆ దేశాల్లో కరోనా రోగుల్ని గుర్తించే శునకాలు)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు