భారత్‌కు హామీ ఇచ్చిన శ్రీలంక...చైనా నౌకకు చెక్‌!

6 Aug, 2022 20:43 IST|Sakshi

కొలంబో:  భారత్‌ ఒత్తిడి మేరకు నిఘా నౌక పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకోమని చైనాను శ్రీలంక అభ్యర్థించింది. ఈ మేరకు యువాన్‌వాంగ్‌ 5 చైనీస్‌ పోర్ట్‌ ఆఫ్‌ జియాంగిన్‌ నుంచి ఆ నిఘా నౌక శ్రీలంకకు సమీపంలోని మార్గ మధ్యలో ఉంది. ఆ నౌక గురువారం చైనీస్‌ ఆధ్వర్యంలో శ్రీలంక నౌకాశ్రయమైన హంబన్‌టోటాకు చేరుకుంటుందని మెరైన్‌ ట్రాఫిక్‌ పేర్కొంది. ఇది పరిశోధనలకు సంబంధించిన నిఘా నౌకగా అనుమానిస్తోంది భారత్‌.

ఇది రెండు రకాలగా ఉపయోగపడే గూఢచారి నౌక, పైగా దీన్ని అంతరిక్ష ఉపగ్రహ ట్రాకింగ్‌తోపాటు ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాలలోనూ వినియోగిస్తారు. అయితే ఈ నౌక తమ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు చైనా ఉపయోగిస్తుందేమోనని భారత్‌ తీవ్ర ఆందోళన చెందుతుంది. ఈ విషయమై కొలంబోలో ఫిర్యాదు చేసింది కూడా. అదీగాక భారత్‌కి పొరుగున ఉన్న శ్రీలంక నుంచి చైనా బలపడుతుందేమోనని అనుమానిస్తోంది.

ఐతే శ్రీలంక విదేశాంగ మంత్రిత్వశాఖ భారత భద్రత, ఆర్థిక ప్రయోజనాలకు ఎలాంటి అవాంతరం తలెత్తకుండా చూడటమే కాకుండా తగిన చర్యలను కూడా తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ  చైనా రాయబార కార్యాలయానికి ఈ నౌక పర్యటన వాయిదా వేసుకోవాలంటూ వ్రాత పూర్వకంగా అభ్యర్థించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. శ్రీలంక సముద్ర జలాల్లో భారత్‌కి కుట్ర తలపెట్టేలా ఎలాంటి వివాదాస్పద పర్యటన కొనసాగదని ఆ దేశ అధ్యక్షుడు విక్రమశింఘే రణిల్‌ భారత్‌కి హామీ ఇచ్చారు. అంతేకాదు ఆ చైనా నౌక ఇంధనం నింపడానికి, సరఫరా చేయడానికి వస్తుందని చెబుతోంది శ్రీలంక. 

(చదవండి: Gotabaya Rajapaksa: ప్లీజ్‌ ఆయన్ని అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక)

మరిన్ని వార్తలు