Sri Lanka Crisis: నిరసనల్లో వేల మంది.. పట్టించుకోని జంట.. ఫోటో వైరల్‌

14 Jul, 2022 21:18 IST|Sakshi

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ప్రజాగ్రహంతో అట్టుడుకుతోంది. అధ్యక్షుడు రాజపక్స గొటబయ, ప్రధాని విక్రమసింగేల భవనాలను ముట్టడించారు నిరసనకారులు. కొద్ది రోజులుగా నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. అధ్యక్షుడు గొటబయ దేశం నుంచి పారిపోయారు. తన పదవికి రాజీనామా చేశారు. ఇలా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న తరుణంలో శ్రీలంక న్యూస్‌ సంస్థ న్యూస్‌వైర్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. వేల సంఖ్యలో నిరసనకారులు ఆందోళనల్లో పాల్గొన్న సమయంలో ఓ జంట ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది న్యూస్‌ వైర్‌. 

గత బుధవారం ప్రధానమంత్రి రణీల్‌ విక్రమసింఘే కార్యాలయం ముందు నిరసనలు జరుగుతున్న సమయంలో ఈ ఫోటో తీసినట్లు రాసుకొచ్చింది న్యూస్‌వైర్‌. 'కొలంబోలోని ప్రధానమంత్రి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు దారితీసిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలలో పాల్గొన్న తర్వాత ఒక జంట ప్రేమను ప్రదర్శించడం కనిపించింది.' అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని విక్రమం సింఘే బాధ్యతలు తీసుకున్న తర్వత జరిగిన నిరసనల్లో ఇప్పటి వరకు ఒకరు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 80 మంది వరకు గాయపడ్డారు. అధ్యక్షుడు గొటబయ ముందుగా మాల్దీవులకు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్‌ చేరుకున్నారు. అక్కడ దిగిన తర్వాత స్పీకర్‌కు తన రాజీనామాను పంపించినట్లు వార్తలు వచ్చాయి.

ఇదీ చూడండి: Gotabaya Rajapaksa: గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే.. మరోదేశం పోవాల్సిందే!

మరిన్ని వార్తలు