లంకలో ప్రజా వ్యతిరేకత: కేంద్ర కేబినెట్‌ రాజీనామా.. కొత్త కేబినెట్‌తో ప్రధానిగా మహీందా రాజపక్సే?

4 Apr, 2022 07:42 IST|Sakshi

శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. రాజకీయ సంక్షోభానికి తెర తీసింది. కేంద్ర కేబినెట్‌లోని మొత్తం 26 మంత్రులు తమ పదవులకు ఆదివారం రాజీనామా చేశారు. సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో ప్రభుత్వం విఫలమైందన్న కారణంతోనే తాము రాజీనామా చేస్తున్నట్లు మంత్రులు తమ లేఖల్లో పేర్కొన్నారు. అయితే.. 

ఆదివారం అర్ధరాత్రి లంక మంత్రులంతా తమ రాజీనామాలను ప్రధాని మహీందా రాజపక్సకు సమర్పించగా.. ప్రధాని పదవికి మాత్రం మహీందా రాజీనామా చేయడానికి సుముఖంగా లేనట్లుతెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఉదయం శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఆపద్ధర్మ ప్రభుత్వం లేదంటే కొత్త కేబినెట్‌.. ఈ రెండు ఆఫ్షన్స్‌లో ఏదో ఒకదాంతో మహీందా ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.


రాజపక్స కుటుంబ చిత్రం

ఇక రాజీనామా చేసిన మంత్రుల్లో మహీందా తనయుడితో పాటు మరో ఇద్దరు దగ్గరి బంధువులే కావడం విశేషం. దీంతో ప్రజావ్యతిరేకత కొంతైనా తగ్గుముఖం పడుతుందన్న ఆలోచనలో ఉన్నాడు ప్రధాని మహీందా. ఇక కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా ఆదివారం పౌరులు, విద్యార్థులు, ప్రతిపక్షాలు కలిసి నిరసనలు వ్యక్తం చేయగా.. ఉద్రిక్తతలకు దారి తీశాయి.

స్వాతంత్ర్యం వచ్చిన 1948 నుంచి ఇప్పటిదాకా ఈ స్థాయిలో అధిక ధరలు, కరెంట్‌కోతలు, నిత్యావసరాల కొరత.. చూస్తుండడం ఇదేమొదటిసారి. అందుకే ప్రజా వ్యతిరేకత పెల్లుబిక్కింది.

సంబంధిత వార్త: లంకలో ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటంటే..

మరిన్ని వార్తలు