Fuel Crisis In Sri Lanka: ఛాయ్‌, బన్‌లు అందిస్తున్న లంక మాజీ క్రికెటర్‌

19 Jun, 2022 18:26 IST|Sakshi

Ex Lankan Cricketer Serves Tea, Buns: శ్రీలంక తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన పలు హింసాత్మక అల్లరుల తదనంతరం శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం శ్రీలంక కొత్త ప్రభుత్వం కూడా ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పలురకాలుగా ప్రయత్నిస్తోంది కూడా. అదీగాక విదేశీ మారక నిల్వలు కూడా తగ్గిపోవడంతో వస్తువులను దిగుమతి చేసుకోవడం కూడా కష్టంగా మారింది. అంతేకాదు ఇంధన సంక్షోభాన్ని సైతం ఎదుర్కొంటుంది. దీంతో అక్కడ ప్రభుత్వం అనవసర ప్రయాణాలను సైతం తగ్గించుకోమని ప్రజలకు సూచించింది కూడా.

ఈ మేరకు శ్రీలంకలో పెట్రోల్‌ బంక్‌ల వద్ద జనాలు ఇంధనం కోసం క్యూలో నిలుచుని పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక మాజీ క్రికెటర్‌ రోషన్‌ మహానామా పెట్రోల్‌ బంక్‌ల వద్ద నుంచొని ఉన్న ప్రజలకు టీలు, స్నాక్స్‌ సర్వ్‌ చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ...క్యూలో ఉన్నవాళ్లలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. పైగా అంతసేపు నుల్చుని ఉండటంతో ఆకలిగా కూడా ఉండోచ్చు. అందువల్ల మనం వారికి సాయం చేయాల్సిన సమయం ఇది. అందుకే ఇలా చేశానని చెప్పాడు.

అలాగే ప్రతిఒక్కరిని తమ కోసం కాకపోయిన మన పక్కవారి కోసమైన ఏమైన ఆహార పదార్థాలు తీసుకువెళ్లడం మంచిది. ఎవరికైన బాగోకపోతే అత్యవసర నెంబర్‌ 1990కి కాల్‌ చేయండి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఒకరికొకరు సాయంగా ఉంటూ..మద్దతు ఇచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ క్రికెటర్‌ రోషన్‌ మహానామా తాను ప్రజలకు సర్వ్‌ చేసిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ నెటిజన్లతో ఈ విషయాలను పంచుకున్నారు. 

(చదవండి: ‘మొత్తం ప్రతిపక్షాన్ని క్లీన్‌స్వీప్‌ చేయాలని ఇమ్రాన్‌ చూస్తున్నారు’)

మరిన్ని వార్తలు