Gotabaya Rajapaksa: ప్లీజ్‌ ఆయన్ని అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక

6 Aug, 2022 16:55 IST|Sakshi

కొలంబో: శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణం గోటబయే నంటూ నిరసనకారులు ఆయన అధికార నివాసాన్ని చుట్టుముట్టడంతో ఆయన మాల్దీవులకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఐతే మాల్దీవులో కూడా శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు నిరసన సెగ తగలడంతో పలాయనం చిత్తగించక తప్పలేదు.

దీంతో ఆయన గత నెల జులై 14 నుంచి సింగపూర్‌లో 14 రోజుల పర్యాటక వీసాపై అక్కడే ఉంటున్నారు. ఐతే ఆ వీసా గడువు ఆగస్టు 11తో ముగియనుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం రాజపక్సను మరో 14 రోజులు అక్కడే ఉండనివ్వండి అంటూ సింగపూర్‌ అధికారులను అభ్యర్థించినట్లు సమాచారం. దీంతో ఆయన మరికొన్ని రోజులు సింగపూర్‌లోనే గడపనున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు గోటబయ జులై 15న రాజీనామ చేసినట్లు శ్రీలంక పార్లమెంట్‌ స్పీకర్‌ మహింద అబేవర్ధన బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఆయన దేశాన్ని వదిలి పారిపోయిన తదుపరి గోటబయ స్థానంలో ఆయన పార్టీ ఆశీస్సులతోనే రణిల్‌ విక్రమసింఘే శ్రీలంక కొత్త అధక్ష్యుడిగా ఎన్నికయ్యారు.

(చదవండి: వేగంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులు...లాక్‌డౌన్‌ దిశగా అడుగులు)

మరిన్ని వార్తలు