బాప్‌రే! గాలి పటంతో పాటు మనిషి కూడా గాల్లోనే... !!

22 Dec, 2021 17:09 IST|Sakshi

నిజంగా ఎవరికైన గాలిపటం ఎగరు వేయడం సరదాగా ఉంటుంది. పైగా కొంతమంది అదోక హాబీలా ఎప్పుడూ గాలిపటాలను ఎగరువేసే వాళ్లు కూడా ఉన్నారు. అయితే శ్రీలంకకు చెందిన ఒక వ్యక్తి సరదాగా తన స్నేహితులతో గాలిపటాలు ఎగరువేసేడు. కానీ అనుహ్యంగా అతను కూడా గాల్లోకి ఎగిరిపోయాడు.

(చదవండి: పంచాయితీ ఎన్నికల్లో ఒక అభ్యర్థికి కనివినీ ఎరుగని ఓట్లు!... కచ్చితంగా షాక్‌ అవుతారు!!)

అసలు విషయంలోకెళ్లితే...  శ్రీలంకలో తై పొంగల్ నాడు నిర్వహించే గాలిపటాలు ఎగరు వేసే పోటీల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. పైగా శ్రీలంకవాసులు పొంగల్ పండుగను బాగా జరుపుకోవడమే కాక అత్యంత సృజనాత్మకమైన గాలిపటాలు తయారు చేసి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎగరువేస్తారు. ఈ మేరకు ఎప్పుడూ జరిగే విధంగానే శ్రీలంకలో జాఫ్నాలోని పాయింట్ పెడ్రోలో అకైట్ ఫ్లయింగ్ గేమ్ పోటీలు నిర్వహించారు. దీనిలో భాగంగా చాలామంది రకరకాల గాలిపటాలను ఎగరువేసి గెలిచేందుకు పాల్గొంటారు. ఇదేవిధంగా ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఒక పెద్ద గాలిపటాన్ని ఎగరువేసే నిమిత్తం ఆ పోటీలో పాల్గొన్నాడు

అయితే ఆ పోటిదారుని బృందం అంతా ఆ గాలిపటాన్ని జనపనారతో కూడిన తాళ్లతో ఒక పెద్ద గాలిపటాన్ని ఎగరువేశారు. ఈ మేరకు ఆ బృందంలోని ఆరుగురు నెమ్మదిగా ఆ తాడుని వదిలేస్తే ఈ పోటీదారుడు మాత్రం అనుహ్యంగా తాడుని వదిలి పెట్టడంతో... దీంతో అతను గాలిపటం తోపాటు గాలిలో కొన్ని సెకన్లు ఉన్నారు. దీంతో అతని బృందంలోని సభ్యులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురై 'తాడు వదిలేయ్‌' అంటూ అరిచారు. కానీ అతను మాత్రం తాడు వదలడానికి భయపడి అలాగే గాల్లో ఉండిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి ఆ వ్యక్తి తాడుని వదిలేసి గాయాలు పాలుకాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. 

(చదవండి: విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు)

మరిన్ని వార్తలు