ఆర్ధిక పాఠాలు నేర్చుకుంటున్న శ్రీలంక... పొదుపు దిశగా అడుగులు

7 Jun, 2022 21:05 IST|Sakshi

Sri Lanka Crisis: గత కొన్ని రోజులుగా శ్రీలంక తీవ్ర రాజకీయ, ఆర్థిక సంకోభాలతో కొట్టుమిట్టాడుతూ.. తీవ్ర ఉ‍ద్రిక్తలతో మగ్గిపోయింది. ఇప్పడిప్పుడే కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. కానీ అక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం కొత్త ప్రభుత్వానికి ఒక సవాలుగా మారిందనే చెప్పాలి. ఆ దేశా ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడానికి ప్రధాని రణిల్‌ విక్రమసింఘే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అందులో భాగంగా తమ దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ.... ఆర్థిక సంక్షోభం నుంచి మనం బయటపడాలంటే ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఇంధనానికి సంబంధించి రాబోయే మూడు వారాలు మనం గడ్డు పరిస్థితులను ఎదుర్కోవల్సి ఉంటుంది. అందువల్ల మనం ఇప్పటి నుంచే ఇంధనం, గ్యాస్‌లను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అనవసరమైన ప్రయాణాన్ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి.

ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత. సంక్షోభాన్ని అధిగమించడానికి దేశం ఇంధనం కోసం నెలకు సుమారు 500 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తుంది" అని చెప్పారు. అదీగాక అంతర్జాతీయ పరంగా మనం అనుసరిస్తున్న నాసిరకం విధానాల వల్లే దేశం మరింతగా అణగారిపోతుందని విక్రమసింఘే అన్నారు. అందువల్ల ప్రస్తుతం దేశం తన విదేశీ సంబంధాలపై పూర్తిగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

(చదవండి: అతి పెద్ద శక్తిగా అవతరించనున్న చైనా... టెన్షన్‌లో యూఎస్‌!)

మరిన్ని వార్తలు