మహింద ఔట్‌!

30 Apr, 2022 06:39 IST|Sakshi

కొలంబో: ప్రతిపాదిత మధ్యంతర ప్రభుత్వంలో సోదరుడు మహిందా రాజపక్సను ప్రధాని పదవి నుంచి తొలగించడానికి శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స శుక్రవారం అంగీకరించారు. కొత్త ప్రధానిని, అన్ని పార్టీలతో కూడిన నూతన మంత్రివర్గాన్ని ఎంపిక చేయడానికి జాతీయ కౌన్సిల్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపారని మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చెప్పారు. కానీ మహిందాను తప్పించాలన్న ఉద్దేశాన్ని గొటబయ వ్యక్తం చేయలేదని ఆయన అధికార ప్రతినిధి అన్నారు.

90 శాతం వద్దంటున్నారు
మహింద రాజీనామా చేయాలని శ్రీలంకలో 89.7 శాతం మంది కోరుకుంటున్నారని తాజా సర్వేలో తేలింది. రాజపక్సల కుటుంబం రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని 89.9 శాతం మంది డిమాండ్‌ చేస్తున్నారు. గొటబయా కూడా దిగిపోవాలని 87.3 శాతం, ఎంపీలంతా తప్పుకోవాలని 55 శాతం జనం అంటున్నారు.

మరిన్ని వార్తలు