లంకలో రాజకీయ సంక్షోభం.. ప్రధాని రాజపక్స రాజీనామా

9 May, 2022 16:04 IST|Sakshi

కొలంబో: ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. విపక్ష నేతలు, లంకేయులు.. అ‍ధ్యక్షుడితో సహా ప్రధాని రాజీనామా చేయాలని ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లంక ప్రధాన మంత్రి మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొంది. 

మరిన్ని వార్తలు