Sri Lanka Crisis: లంకలో పీక్‌ స్టేజ్‌కు నిరసనలు.. రాజకీయ నేతలకు బిగ్‌ షాక్‌

13 May, 2022 14:29 IST|Sakshi

Sri Lanka Crisis..ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలను ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవలే లంక ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక, గురువారం లంక నూతన ప్రధానమంత్రిగా యునైటెడ్ నేషనల్ పార్టీ (యుఎన్‌పి) నాయకుడు రణిల్‌ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. 

ఇదిలా ఉండగా.. ఆర్థిక సంక్షోభం కారణంగా లంకలో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో లంకేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తమపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడం, కాల్పులు జరపడంతో వారు ఆందోళనను పెంచారు. ఆగ్రహంతో కొందరు నిరసనకారులు లంక మాజీ మంత్రి, రాజకీయ నేతల కార్లను సరస్సులోకి తోసేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో ఓ నిరసనకారుడు మాట్లాడుతూ.. మాకు గ్యాస్‌ లేదు, ఇంధనం లేదు.. అవసరమైన మెడిసిన్‌ దొరకడం లేదు. నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో ఒక్క పూటే భోజనం చేసి పస్తులు ఉంటున్నాము. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.  

 ఇది కూడా చదవండి: మోదీకి ధన్యవాదాలు: శ్రీలంక కొత్త ప్రధాని

మరిన్ని వార్తలు